పోటీతత్వంతో ఉన్నత భవిత
నారాయణవనం: యువ ఇంజినీర్లు పోటీ తత్వం పెంపొందించుకుంటే ఉన్నత భవిష్యత్ పొందవచ్చని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలల చైర్మన్ డాక్టర్ అశోకరాజు తెలిపారు. బుధవారం కళాశాలలోని ఇండోర్ స్టేడియంలో జుబిలేషన్ డే నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం అశోక్‌రాజు మాట్లాడుతూ జీవితంతో ఎంత ఎత్తుకు ఎదిగినా, కుటుంబ సభ్యులకు సమయం కేటాయించాలని సూచించారు. మంచి జీవనశైలిని అలవర్చుకోవాలని కోరారు. అనంతరం ఆయనను విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ క్రమంలోనే వివిధ క్రీడాపోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జుబిలేషన్‌లో భాగంగా గురువారం చేపట్టే కార్యక్రమాలకు జేఎన్‌టీయూ అనంతరపురం వీసీ సుదర్శనరావు, సినీనటి సంయుక్తా మీనన్, యాంకర్ భానుశ్రీ హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
పాఠశాల స్థలం కబ్జాకు యత్నం
– అడ్డుకున్న మహిళపై దాడి
శ్రీరంగరాజపురం : ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కబ్జాకు ప్రయత్నించిన వారిని అడ్డుకున్న మహిళపై దాడి చేసి గాయపరిచిన సంఘటన మండలంలోని పొదలపల్లి దళితవాడలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పొదలిపల్లి దళితవాడలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నిర్మాణానికి గతంలో జయరామయ్య తల్లిదండ్రులు సర్వే నంబర్ 213/16లో 1.13 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇవ్వడం జరిగింది. నాడు–నేడు పథకం ద్వారా పాఠశాలను అభివృద్ధి పరిచారు. మిగిలిన స్థలంలో అంగన్‌వాడీ కేంద్రం నిర్మించడానికి గత ప్రభుత్వంలో నిధులు మంజూరు అయ్యాయి. కానీ అంగన్‌వాడీ కేంద్రానికి కేటాయించిన స్థలాన్ని ఆక్రమిండానికి ప్రయత్నంచారు. కూటమి ప్రభుత్వం రావడంతో అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నాగులయ్య కుమారుడు శ్రీరాములు కబ్జా ప్రయత్నించాడు. భూకబ్జాను జయరామయ్య భార్య విజయ అడ్డుకోవడంతో ఆమైపె విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచాడు. గాయపడిన మహిళను స్థానికులు 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కుప్పంలో డిజిటల్ హెల్త్ నెర్వ్ సెంటర్
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో రూ.5.34 కోట్లతో డిజిటల్ హెల్త్ నెర్వ్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులోని టాటా డిజిటల్ హెల్త్ నెర్వ్ సెంటర్ ఆధ్వర్యంలో కుప్పంలో ఒక సెంటర్‌ను ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ సెంటర్‌లో సేవలు అందించడానికి గత నెలలో కొందరు సిబ్బందిని డిప్యుటేషన్‌పై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ వీరపాండియన్ నియమించారు.
పోటీతత్వంతో ఉన్నత భవిత
Comments
Please login to add a commentAdd a comment