హిందీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్?
● స్థానిక ఉపాధ్యాయులు, ఇన్విజిలేటర్లపై ఆరోపణలు ● ఉన్నతాఽధికారులు చర్యలు తీసుకోవాలి
చౌడేపల్లె: స్థానిక ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో బుధవారం నిర్వహించిన పదో తరగతి హింది పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగిందన్న ఆరోపణలు వెలువెత్తాయి. ఉన్నత పాఠశాలలో రెండు పరీక్ష కేంద్రాలున్నాయి. వీటిలో మొత్తం 500 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. వీటి నిర్వహణకు మొత్తం మండలంలో పనిచేస్తున్న 26 మంది ఎస్‌జీటీలను ఇన్విజిలేటర్లుగా నియమించారు. స్థానిక ఉన్నత పాఠశాలలో ఉన్న టీచర్లకు సుపరిచితులైన ఇన్విజిలేటర్లు ఉండడంతో మాస్ కాపీయింగ్ జోరుగా సాగుతోందని పలువురు విమర్శించారు. అలాగే స్థానిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, పరీక్ష కేంద్రం వద్ద తిష్ట వేసి, ఇన్విజిలేటర్లైపె ఒత్తిడి తెస్తూ మాస్ కాపీయింగ్‌కు సహకారమిస్తున్నారని పలువురు విమర్శించారు. స్థానికంగా ఉండే ఉపాధ్యాయులకు స్థానికంగా ఉన్న ఇన్విజిలేటర్లను నియమించడంతోనే మాస్ కాపీయింగ్ జోరుగా సాగుతోందని పలువురు విమర్శించారు. రాబోయే ఇంగ్లిషు పరీక్షలో మరింత జోరుగా సాగే అవకాశం ఉందని సమాచారం. ఉన్నతాధికారులు పరీక్ష కేంద్రంపై దృష్టి సారించి, చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ విషయమైన పరీక్ష కేఽంద్రం చీఫ్ వేణును వివరణ కోరగా అలాంటిదేమీ జరగలేదని, మూడుసార్లు స్క్వాడ్ తనిఖీ చేసిందని, పటిష్టంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment