పది పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరా ధ్వంసం
–పోలీసులకు ఫిర్యాదు
రొంపిచెర్ల: స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు ఆ స్కూలు ప్రధానోపాధ్యాయులు మోహన్‌రెడ్డి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెచ్‌ఎం కథనం మేరకు.. రొంపిచెర్ల మండలంలో ఏటా పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతుందని కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్, డీఈఓకు ఫిర్యాదు చేశారు. దీంతో రొంపిచెర్ల బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లోని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మాస్ కాపీయింగ్ జరగడం లేదని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై విద్యాశాఖ అధికారులు పోలీసులు, డీఈఓకు ఫిర్యాదు చేశారు. సీసీ ఘటన స్థలాన్ని బుధవారం ఎస్‌ఐ సుబ్బారెడ్డి, ఎంఈఓ శ్రీనివాసులు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment