సమారోహం.. | - | Sakshi
Sakshi News home page

సమారోహం..

Published Fri, Mar 21 2025 1:58 AM | Last Updated on Fri, Mar 21 2025 1:54 AM

సమారో

సమారోహం..

సంస్కృత భాష పరిరక్షణ.. సంస్కృతి మనుగడే లక్ష్యంగా బోధన చేస్తున్న జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో గురువారం జరిగిన నాలుగో దీక్షాంత సమారోహం సంస్కృతికి ఛత్రం పట్టింది. పతకాలు.. పట్టాలు.. పీహెచ్‌డీలు అందుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆనందం అవధులు దాటి, ఉప్పొంగింది.
ఘనంగా జాతీయ సంస్కృత వర్సిటీ నాలుగో స్నాతకోత్సవం
● 22 మందికి బంగారు పతకాలు ప్రదానం ● 564 మందికి డిగ్రీ, పీజీ..75 మందికి పీహెచ్‌డీ పట్టాల అందజేత ● సంస్కృత భాషాభివృద్ధే లక్ష్యంగా వర్సిటీ అడుగులు

ఐదు మహాగ్రంథాల ఆవిష్కరణ

రామానుజ ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో సురపురం శ్రీనివాసాచార్య రచించిన సిద్ధాంత చింతామణి, రీసె ర్చ్‌ అండ్‌ పబ్లికేషన్స్‌ విభాగం ద్వారా శివరామభట్‌ సంపాదకీయంలోని మహస్వినీ పత్రికను, అనంతరం జ్యోతిష్య విభాగం డీన్‌ కృష్ణేశ్వర్‌ ఝా ఆధ్వర్యంలో వేదవేదాంగం, డాక్టర్‌ సోమనాథ దా స్‌ రీసెర్చ్‌ అండ్‌ పబ్లికేషన్స్‌ ఆధ్వర్యంలో వర్సిటీ న్యూస్‌ లెటర్‌ శేముషీ గ్రంథాలను అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ వెంకట నారాయణరావు, డీన్లు దక్షణమూర్తి శర్మ, రజనీకాంత శుక్లా, పరీక్షల నియంత్రణాధికారి కే సాంబశివమూర్తి పాల్గొన్నారు.

564 మందికి డిగ్రీ, పీజీ పట్టాలు..

75 మందికి పీహెచ్‌డీలు

వర్సిటీ నాలుగో స్నాతకోత్సవంలో భాగంగా 2023–24 అకడమిక్‌ విద్యాసంవత్సరానికి సంబంధించి 75 మంది విద్యార్థులకు విద్యావారిధి(పీహెచ్‌డీ) పట్టాలను అందజేశారు. అలాగే 564 మంది విద్యార్థులకు ఆచార్య, ఎంఏ, ఎమ్మెస్సీ, బీఏ, బీఎస్సీ, ఎమ్మెస్సీ యోగాథెరఫీ, సర్టిఫికెట్‌, డిప్లొమో పట్టాలను అతిథుల చేతుల మీదుగా అందజేశారు.

స్నాతకోత్సవంలో గ్రంథాలను ఆవిష్కరిస్తున్న అతిథులు, వర్సిటీ అధికారులు

తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం నాలుగో దీక్షాంత సమారోహం అట్టహాసంగా జరిగింది. తిరుపతి మహతి ఆడిటోరియం వేదికగా గురు వారం జరిగిన వర్సిటీ నాలుగో స్నాతకోత్సవానికి అధ్యక్ష హోదాలో హాజరైన వర్సిటీ చాన్సలర్‌ పద్మభూషణ్‌ ఎన్‌ గోపాలస్వామికి వేదపండితులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్రీ సంస్కృత విద్యాపీఠం మాజీ వీసీ పద్మశ్రీ డాక్టర్‌ వీఆర్‌ పంచముఖి ఆన్‌లైన్‌ విధానంలో హాజరై, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సంస్కృతభాష పరిరక్షణకు మూలకేంద్రమని కొనియాడారు. ప్రాచీన సంస్కృత భాషను సంరక్షిస్తూ, ఆధునిక వైజ్ఞానిక తత్త్వాలను అనుసంధానిస్తూ, భారతీయ జ్ఞాన పరంపరను భావిభారతావనికి అందిస్తున్న ఉత్తమ క్షేత్రంగా వర్సిటీ విరాజిల్లుతుందన్నారు. త్వరలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను సంస్కృత భాషతో అనుసంధానం చేసేందుకు విశేష పరిశోధనలు చేస్తామని తెలిపారు.

నూతన పరిశోధనల వేదిక ఎన్‌ఎస్‌యూ

వీసీ జీఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి వర్సిటీ ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్‌ ప్రణాళికలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధునాత సాంకేతిక పరిజ్ఞానంతో నూతన పరిశోధనలకు వర్సిటీ వేదికవుతోందన్నారు. సంస్కృత భాషాభివృద్ధే వర్సిటీ లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పారు. దేశంలో పూర్తి స్థాయిలో అన్ని విభాగాల్లో సంస్కృత భాష బోధిస్తు న్న ఏకై క వర్సిటీ జాతీయ సంస్కృత వర్సిటీ అని కొనియాడారు. రానున్న విద్యాసంవత్సరం నుంచి వర్సిటీలో ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యాకోర్సులను సైతం ప్రారంభించనున్నట్లు తెలిపారు.

హృదయాన్ని స్పృశించిన సన్నివేశాలు

ఎన్‌ఎస్‌యూ నాలుగో స్నాతకోత్సవంలో పట్టాలు, బంగారు పతకాలు పొందిన విద్యార్థులు తల్లిదండ్రు లు కలిసిన సన్నివేశాలు వీక్షకులు హృదయాన్ని కట్టిపడేశాయి. పీజీ ఓవరాల్‌ టాపర్‌గా నిలిచి 4 పతకాలతో పాటు, ఒక బంగారు పతకం సాధించిన అమిత్‌ విక్ర మ్‌ కుమారుడు, కుమార్తె తండ్రి సాధించిన పతకా లను పట్టుకుని ముద్దాడిన సంఘటన పలువురిని క లచి వేసింది. అలాగే పీజీ జ్యోతిష్యశాస్త్రంలో టాపర్‌గా నిలిచిన కేరళకు చెందిన ఎంపీ అన్గే విద్యార్థి తల్లి షీజా కేరళ నుంచి వచ్చి, కుమార్తెను ముద్దాడి అక్కున చే ర్చుకుని ఆనందబాష్పాలు రాల్చింది. అలాగే పీహెచ్‌ డీ పట్టా అందుకున్న దివ్యాంగుడు కే హరిబాబుకు అధికారులు మోకాళ్లపై నిలుచుని పట్టా అందజేశారు. అనంతరం భార్య, ఆయన కుమారుడు డాక్టరేట్‌ ప ట్టాను చూస్తూ ఆనందోత్సహాంలో మునిగితేలారు.

బంగారు పతకాలను సాధించిన ఆనందంలో తలపాగాలను

గాలిలోకి విసిరేస్తున్న విద్యార్థులు

ఓవరాల్‌ టాపర్‌గా

అమిత్‌ విక్రమ్‌, జానకి

వర్సిటీలో ఆచార్య (పీజీ) స్థాయిలో విద్యార్థి కేఎస్‌ అమిత్‌ విక్రమ్‌ ఓవరాల్‌ టాపర్‌గా నిలిచి సుమారు ఐదు పతకాలను సాఽధించారు. అలాగే శాస్త్రి (డిగ్రీ) కోర్సులో ఓవరాల్‌ టాపర్‌గా నిలిచిన వై జానకి నాలుగు బంగారు పతకాలు కై వసం చేసుకుంది. ప్రాక్‌–శాస్త్రిలో (ఇంటర్‌) ప్రథమస్థానంలో నిలిచిన లక్ష్మీ ప్రసన్న బంగారు పతకం అందుకున్నారు.

మెరిసిన 22 మంది బంగారు కొండలు

విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో ప్రతిభ చూ పి ప్రథమస్థానం సాధించిన 22 మంది విద్యార్థులు బంగారు పతకాలను కై వసం చేసుకున్నారు. గోల్డ్‌మెడల్స్‌ సాధించిన వారిలో శాసీ్త్ర విభాగంలో వై జా నకి, బీఏలో జి సంధ్య, బీఎస్సీలో వి త్రిపురసుందరి, బీఎస్సీ యోగాలో టి అభినయ పసిడి పతకాలు అందుకున్నారు. ఆచార్య విభాగంలో సునీతాప్రుష్టి, వైష్ణవి, అన్గా, అనురిధ్‌ భరద్వాజ్‌, మహదేవన్‌, దే వప్రసాద్‌ భట్‌, అజిత్‌ సింగ్‌, విక్రమ్‌, తునుశ్రీ, హే మసుందర్‌రావు, శుభశ్రీ, అస్రఫ్‌ అలమ్‌ఖాన్‌, కి షోర్‌ పాండే, సాగరిక సర్కార్‌, ఎంఎలో సంధ్యబాయ్‌, ఎమ్మెస్సీలో అభినయ్‌శ్రీ, ఎమ్మెస్సీ యోగాలో ఎం దేవీప్రసన్న బంగారు పతకాలు సాధించారు. వీరితో పాటు బీఈడీలో మోనికా బొహిదర్‌, ఎంఈడీలో జయక్రిష్ణరాయ్‌ ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సమారోహం..1
1/8

సమారోహం..

సమారోహం..2
2/8

సమారోహం..

సమారోహం..3
3/8

సమారోహం..

సమారోహం..4
4/8

సమారోహం..

సమారోహం..5
5/8

సమారోహం..

సమారోహం..6
6/8

సమారోహం..

సమారోహం..7
7/8

సమారోహం..

సమారోహం..8
8/8

సమారోహం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement