దౌర్జన్యంగా నిర్వహించిన వేలంపాటను రద్దు చేయాలి
– మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్
శ్రీరంగరాజపురం (కార్వేటినగరం) : కూటమి నా యకుల దౌర్జన్యంతో పెనుమూరు షాపింగ్ కాంప్లెక్స్‌కు నిర్వహించిన వేలం పాటను రద్దు చేసి అ ధికారుల సమక్షంలో బహిరంగ వేలం పాట నిర్వహించాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వా మి డిమాండ్ చేశారు. శుక్రవారం పెద్ద తయ్యూరు లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. దౌర్జన్యంతో వేలం పాట నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. కలెక్టర్, ఎస్పీ వెంటనే స్పందించి అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహాసముద్రం దయాసాగర్‌రెడ్డి పది మంది పేదలకు మంచి చేయాలనే ఉద్దేశంతో నూతన వాణిజ్య కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపడితే, నేడు కూటమి నాయకులు షాపింగ్ కాంప్లెక్స్ వేలం పాటకు రాజకీయ రంగు పులిమి తక్కువ ధరలకే పచ్చనేతలకు కట్టబెట్టి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఆరోపించారు. అదే విధంగా 49 కొత్తపల్లి మిట్టలో జరిగే వారపు సంతలో వేలం పాట దక్కించుకున్న వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుడికి అధికారులు సహకరించాలని కోరారు. ఆయన వెంట జిల్లా ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, జనార్దన్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నేడు పోర్ట్‌ఫోలియో జడ్జి సమీక్ష
చిత్తూరు అర్బన్ : చిత్తూరు పోర్ట్ ఫోలియో జడ్జి జస్టిస్ సురేష్‌రెడ్డి శనివారం జిల్లాలోని న్యాయమూర్తులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. చిత్తూరు నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో చిత్తూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న న్యాయమూర్తులతో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ సమీక్ష జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment