బడుల విలీనంపై ప్రభుత్వం స్పందించాలి
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం వెంటనే పీఆర్‌సీ కమిటీని ఏర్పాటు చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖరనాయుడు డిమాండ్ చేశారు. ఆ సంఘం నాయకులు జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 5వ తేదీన తిరుపతిలో ఐదు జిల్లాల ప్రాంతీయ విద్యా సదస్సు, పోరుబాట సదస్సు జరుగుతుందన్నారు. ప్రభుత్వం తొలి సంతకం చేసిన డీఎస్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ మాట్లాడుతూ.. 117 జీవో రద్దు, పాఠశాలల విలీనంపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయుల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. తిరుపతి జిల్లా కేంద్రంలో నిర్వహించే పోరుబాట సదస్సుకు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి అధిక సంఖ్యలో సంఘం సభ్యులు, టీచర్లు పాల్గొనాలన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మణిగండన్, నాయకులు సుధాకర్ రెడ్డి, కె.రెడ్డెప్ప నాయుడు, రెహనా బేగం, ఎస్‌పీ బాషా, సరిత, ఏకాంబరం, పార్థసారథి, పంటపల్లి సురేష్, ఈశ్వర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment