ఎస్పీడబ్ల్యూలో బయోటెక్ ఫెస్ట్
తిరుపతి సిటీ :పద్మావతి డిగ్రీ, పీజీ కళాశాల బయోటెక్నాలజీ విభాగం, ఐక్యూఏసీ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ నారాయణమ్మ అధ్యక్షతన శుక్రవారం బయోటెక్ రెవల్యూషన్ ది నెక్ట్స్ ఫ్రాంటియర్– ట్రాన్స్‌ఫార్మింగ్ సైనన్స్ టు సొల్యూషన్ అనే అంశంపై బయోటెక్ ఫెస్ట్ నిర్వహించించారు.ఐజర్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆయన మాట్లాడుతూ ఆధునిక సమాజంలో బయోటెక్నాలజీ పాత్ర, ప్రాముఖ్యత, అవకాశాలపై అవగాహన కల్పించారు. అనంతరం బయోటెక్నాలజీ సైన్స్ ఎక్సోపో ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ బుడోల్లాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ బి.విశ్వనాథ్, విభాగాధిపతి డాక్టర్ భువనేశ్వరి, డాక్టర్ భద్రమణి, అధ్యాపకులు హేమలత, కుసుమ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment