దమ్ముంటే పట్టుకో.. | - | Sakshi
Sakshi News home page

దమ్ముంటే పట్టుకో..

Published Mon, Mar 24 2025 6:48 AM | Last Updated on Mon, Mar 24 2025 9:24 AM

దమ్ము

దమ్ముంటే పట్టుకో..

యథేచ్ఛగా ఇసుక, గ్రావెల్‌ అక్రమ రవాణా

రూ. కోట్లు కొల్లగొడుతున్న నేతలు

రెచ్చిపోతున్న పచ్చ మాఫియా

చేష్టలుడిగి చూస్తున్న అధికారులు

వెదురుకుప్పం : సమయం లేదు మిత్రమా.. అందిన కాడికి దోచేద్దాం.. ఎవరైనా అడ్డొస్తే వాళ్ల సంగతి తేల్చేద్దాం.. అధికారులు మాట వినకపోతే వేటు వేద్దాం.. ఇదీ కూటమి ప్రభుత్వంలో బరి తెగిస్తున్న పచ్చనేతల తీరు. అక్రమాలను అడ్డుకుంటున్న అధికారులపై ప్రలోభాలు, బెదిరింపులు.. ప్రత్యక్ష, పరోక్ష దాడులతో హడలిపోతున్నారు. నిక్కచ్చిగా విధులు నిర్వహించాలంటే ఇక్కడ సాధ్యమయ్యే పనికాదు.. నేతలు చెప్పిందల్లా చేస్తే సరి.. ఎదురు తిరిగితే.. పోస్టింగ్‌ కోసం ఎదురు చూడక తప్పని పరిస్థితులు కల్పిస్తున్నారు. పుష్ప సినిమాను తలదన్నేలా నిర్విరామంగా సాగుతున్న సిండికేట్‌ దందాలు అన్నీ ఇన్నీ కావు. జిల్లాలో చోటా నాయకుల నుంచి ప్రజాప్రతినిధుల వరకూ అడ్డూ అదుపూ లేకుండా చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలకు హద్దు లేకుండా పోతోంది. ఇసుక, మట్టి ఉన్న ప్రాంతాల్లో పాగా వేసి అక్రమ సామ్రాజ్యాన్ని నెలకొల్పి భారీ దోపిడీ చేస్తున్నారు.

ఆదాయ వనరులుగా ఇసుక, గ్రావెల్‌

చిత్తూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోనూ కూట మి నాయకులు చేస్తున్న దందాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఇసుక, గ్రావెల్‌ దోపిడీ ఇష్టారాజ్యంగా నడుస్తోంది. ప్రధానంగా ఇసుక, మట్టిని విచ్చలవిడిగా తోడేస్తున్నారు. సహజ సిద్ధంగా ఏర్పడిన ఇసుక, మట్టి అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. ప్రజాప్రతినిధుల అండ దండలతో రూ. కోట్లు ఆర్జిస్తున్నారు. పట్టపగలే గ్రావెల్‌తో పాటు ఇసుకను తవ్వి రవాణా చేస్తున్నా అధికారులు చేతులు ముడుచుకుని చేసేది లేక మిన్నుకుండి పోతున్నారు. జిల్లా నుంచి వందల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లతో ఒక పక్క ఇసుక మరో పక్క గ్రావెల్‌ను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలించి రూ. కోట్లు దండుకుంటున్నారు.

అక్రమార్కులకు అడ్డాగా..

జీడీ నెల్లూరు అక్రమార్కులకు అడ్డాగా మారింది. అధికారుల కళ్లు గప్పి పెద్ద ఎత్తున ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న తీరు చూస్తే విస్తుపోవాల్సిందే. సహజ సిద్ధంగా ఏర్పడిన మట్టి, ఇసుక కూటమి నేతలకు కా సులు కురిపిస్తున్నాయి. కొండలు కనిపిస్తే చాలు ఠంచనుగా నాయకులు వాలిపోయి జేసీబీలతో తవ్వి సొ మ్ము చేసుకుంటున్నారు. అక్రమార్కుల దనార్జనకు కొండలు, గుట్టలు కరిగిపోతున్నాయి. గంగాధర నె ల్లూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోనూ కూ టమి నేతలు ఇలా మట్టి, ఇసుక దోపిడీ చేస్తూ రూ. కోట్లు గడిస్తున్నారన్నదే ప్రజలందరికీ తెలిసిన బహిరంగ సత్యం. తమిళనాడుకు సరిహద్దు ప్రాంతమైన గంగాధర నెల్లూరు నియోజకవర్గం పచ్చ మాఫియాకు అనుకూలంగా మారింది. ప్రధానంగా పాలసముద్రం, గంగాధర నెల్లూరు, శ్రీరంగరాజపురం, కార్వేటి నగరం మండలాల్లో నిత్యం వందల సంఖ్యలో ట్రాక్ట ర్లు, టిప్పర్ల ద్వారా గ్రావెల్‌ను తరలిస్తున్నారు.

పెద్ద ఎత్తున దందాలు

క్వారీ యజమానుల వద్ద నుంచి స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పి వసూళ్లకు తెగపడుతున్నారు. ఆరు మండలాల్లోనూ పీఏలను నియమించిన ఓ ప్రజాప్రతినిధి ఆ యా మండలాల్లో ఎన్ని క్వారీలు ఉన్నాయనే వివరాలను అధికారుల వద్ద నుంచి సేకరించి దందాలకు పాల్పడుతున్నారు. నేను ప్రజాప్రతినిధి పీఏని మామూళ్లు ఇస్తావా వాహనాలు సీజ్‌ చేయమంటావా అంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని రికార్డులు సక్రమంగా ఉంచుకుని క్వారీలను నడుపుతున్నా ఏదో ఒక సాకు చెప్పి నిలిపివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మామూళ్లు ఇచ్చుకుంటేనే సరి లేకుంటే దౌర్జన్యాలు, బెదిరింపులకు దిగుతున్నట్లు చెబుతున్నారు. గతంలో ఇలాంటి దోపిడీలు లేవని, ఈ దోపిడీ విషయంలో గత ప్రభుత్వం ఎన్నో రెట్లు మేలని చెప్పుకుంటుండడం విశేషం.

అక్రమాలు ఇలా..

గంగాధర నెల్లూరు మండలంలోని ముక్కలత్తూరు, కొట్రకోన, పాతపాళెం ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. ముక్కలత్తూరులో నీవా నది నుంచి చైన్నెకి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఇక్కడ పచ్చ బ్యాచ్‌ ఇసుకను డంప్‌ చేసి రాత్రికి రాత్రే ట్రాక్టర్లు ద్వారా తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడ నుంచి వెళ్లే ఇసుక రవాణాకు ఎలాంటి అనుమతి ఉండవని చెబుతున్నారు.

పాలసముద్రం మండలంలోని వనదుర్గాపురం, సింహరాజపురం, బలిజకండ్రిగ, మటవలం గ్రామాల్లో ఇసుక డంప్‌ చేసి రాత్రికి రాత్రే టిప్పర్లు, ట్రాక్టర్లలో కూటమి నేతలు తరలిస్తున్నారు. ఒక టిప్పర్‌ రూ. 25 వేలు పలుకుతోంది.

వెదురు కుప్పం మండలంలోని పచ్చికాపల్లం, వెదురుకుప్పం ప్రాంతాల నుంచి మట్టి దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. రాత్రి పూట జేసీబీల నుంచి గుట్టలను తవ్వి అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు.

శ్రీరంగరాజపురం మండలంలో కూటమి నేతలు విచ్చలవిడిగా మట్టిని విక్రయించి దోచుకుంటున్నారు. ఇక్కడ కూటమి నేతలు చెప్పినట్టే అధికారులు తలలు ఊపుతున్నారు. గ్రావెల్‌ కోసం పచ్చని గుట్టలను మాయం చేస్తున్నారు. పాతపాళ్యం వద్ద ఉన్న కొండను తవ్వి సొమ్ము చేసుకున్నారు. తర్చూరు హైవే రోడ్డు పనుల నిమిత్తం మట్టిని తరలించే క్రమంలో దాన్ని సాకుగా చూపి పెద్ద ఎత్తున గ్రావెల్‌ తరలిస్తున్నట్లు స్థానికలు ఆరోపిస్తున్నారు.

కార్వేటినగరం మండలంలో గ్రావెల్‌, ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేదు. ప్రజాప్రతినిధి సొంత మండలం కావడంతో ఇసుకను డంప్‌ చేసుకుని రవాణా చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ, జనసేన పార్టీలు పోటా పోటీగా అక్రమాలకు పాల్పడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
దమ్ముంటే పట్టుకో..1
1/1

దమ్ముంటే పట్టుకో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement