
చిత్తూరులో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఆడియో రిలీజ్
కాణిపాకం : చిత్తూరు నగరంలోని ఎస్వీ సెట్ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం రాత్రి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్ర ఆడియో అట్టహాసంగా లాంచ్ చేశారు. సినిమా హీరో నందమూరి కళ్యాణ్‌రామ్, హీరోయిన్ సాయి మంజ్రేకర్, నటీనటులు విజయశాంతి, పృద్వీ, దర్శకుడు ప్రదీప్ చిలకూరి, నిర్మాతలు అశోక్ వర్ధన్, సునీల్, కాలేజీ చైర్మన్లు రావూరి వెంకటస్వామి, రావూరి శ్రీనివాసులు, ఎడిటర్ తమ్మీరాజు, రైటర్ శ్రీకాంత్, ఎస్పీ మణికంఠ చందోలు పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. అనంతరం సినిమా చిత్రీకరణ, కథ అంశాన్ని వివరించారు. మ్యూజిక్, తల్లీ, కొడుకు మధ్య జరిగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయన్నారు. ఈనెల 18వ తేదీ సినిమా రిలీజ్ కానుందన్నారు. ప్రేక్షకులు, అభిమానులు సినిమాను ఆదరించాలన్నారు. అభిమానులు ఈ రిలీజ్ వేడుకకు అధిక సంఖ్యలో తరలివచ్చారు.