
వేడుకగా పుష్పపల్లకి
కాణిపాకం: చిత్తూరు నగరంలోని శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయంలో శనివారం రాత్రి పుష్పపల్లకి సేవను వేడుకగా నిర్వహించారు. దీంతో ఆల యంలో పంగుణి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవంలో భాగంగా స్వామివారికి ఉదయం అభిషేకం చేసి భక్తులకు దర్శన సేవలు కల్పించారు. రాత్రి పలు రకాల పుష్పాలు తెచ్చి పుష్ప సేవను ముస్తాబు చేశారు. ఉత్సవమూర్తిని పల్లకిలో ఆశీనులు చేసి పుష్ప పల్లకి సేవను ప్రారంభించారు. రాత్రి 9 గంటల సమయంలో ప్రారంభమైన సేవ అర్ధరాత్రి వరకు కొనసాగింది. భక్తులు అడుగడుగున స్వామి వారికి కర్పూర హారతులు పట్టారు.
సెలెస్టాలో మీనాక్షి సందడి
● ముగిసిన ఉత్సవం
కాణిపాకం : డింగ్..డింగ్..బావా అంటూ మీనాక్షి స్టెప్పులేసి కేక పుట్టించింది. చిత్తూరు నగరంలోని ఎస్వీ సెట్ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారంతో సెలెస్టా 2కే 25 ఉత్సవం ఘనంగా ముగిసింది. తొలుత విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అబ్బురపరిచాయి. ఈ ముగింపు ఉత్సవానికి మీనాక్షి చౌదరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేదికపై నాజుగ్గా నాలుగు స్టెప్పులు వేసి సినిమా విశేషాలను పంచుకుంది. తర్వాత చిత్ర యూనిట్ వేదికపై సందడి చేసింది. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ రావూరి వెంకటస్వామి, రావూరి శ్రీనివాసులు పాల్గొన్నారు.