పెళ్ళికి నిరాకరించారని వేటకొడవలితో దాడి! | After Tragic End To Tamil Nadu Love Story | Sakshi
Sakshi News home page

పెళ్ళికి నిరాకరించారని వేటకొడవలితో దాడి!

Published Sun, Mar 21 2021 2:44 PM | Last Updated on Sun, Mar 21 2021 2:57 PM

After Tragic End To Tamil Nadu Love Story - Sakshi

చెన్నై: ప్రేమ ఫలించకపోవడంతో ఓ వ్యక్తి ఉన్మాదిగా మారాడు.  పెళ్లికి నిరాకరించిన దంపతులు, మనుమరాలిపైనా కత్తి దూసాడు. తమిళనాడులో తిరునెల్వేలి జిల్లా తిరుక్కురుంగుడిలో రసూల్‌రాజ్‌ (52) మతబోధకుడిగా ఉన్నారు. ఇతని భార్య ఎప్సిబాయ్‌ (52). ఈ దంపతులకు ఐదుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహమై భర్తతో కలసి విదేశాల్లో ఉంటున్నారు. వీరి 8నెలల చిన్నారి కుయాన్సీని రసూల్‌ దంపతులు పెంచుతున్నారు. దంపతుల నాల్గో కుమార్తె కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈమెను రోస్మీపురానికి చెందిన శివశంకరన్‌ (25) ప్రేమిస్తున్నానంటూ కొంతకాలంగా వెంటపడుతున్నాడు. ఆ యువకుడి తల్లిదండ్రులు పెళ్లి విషయమై రసూల్‌రాజ్‌ను కలుసుకోగా రసూల్‌దంపతులు నిరాకరించారు. దీంతో కక్ష పెంచుకున్న శివశంకరన్‌ శనివారం తెల్లవారుజామున వేట కొడవలి, పెట్రోల్‌ క్యాన్‌తో రసూల్‌రాజ్‌ ఇంట్లోకి వచ్చి రసూల్‌రాజ్, ఎప్సీబాయ్, చిన్నారి కుయాన్సీని నరికాడు.

వస్తువులను ధ్వంసం చేసి ఇంటిని తగులబెట్టే ప్రయత్నం చేయగా ఇరుగూపొరుగూ రావడంతో పారిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న ముగ్గురిని పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. చిన్నారి ప్రాణాలు విడి చింది. దంపతులిద్దరూ విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడు శివశంకరన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

చదవండి: హిజ్రాతో దోస్తీ, రూ.3 లక్షలు తీసుకుని దారుణం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement