పాల బూత్‌లో మద్యం వ్యాపారం | Alcohol Business in Milk Booth Tadepalli Guntur | Sakshi
Sakshi News home page

పాల బూత్‌ ముసుగులో మద్యం వ్యాపారం

Jul 24 2020 12:47 PM | Updated on Jul 24 2020 12:47 PM

Alcohol Business in Milk Booth Tadepalli Guntur - Sakshi

పట్టుకున్న మద్యం బాటిళ్లు, నిందితులతో పోలీసులు

తాడేపల్లిరూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలో నులకపేట గుంటూరు చానల్‌ పక్కన తండ్రి, కొడుకులు పాల బూత్‌ ముసుగులో మద్యం వ్యాపారం నిర్వహిస్తున్నారని గురువారం రాత్రి టౌన్‌ సీఐ సుబ్రహ్మణ్యంకు సమాచారం రావడంతో క్రైం పోలీసులు శ్యామ్, ఉదయ్‌లను మఫ్టీలో పంపించి మద్యం బాటిళ్లను కొనుగోలు చేయించారు. అనంతరం మద్యం ఇచ్చిన తండ్రి పుల్లారావుని విచారించగా ఎటువంటి సమాధానం చెప్పలేదు. తండ్రిని విచారిస్తుండగానే కొడుకు దొంతా శ్రీను ఇంట్లో ఉన్న మద్యాన్ని వేరే చోటుకి మార్చివేశాడు. పోలీసులు దొంతా శ్రీను కాళ్లకు బురద అవ్వడంతో అనుమానం వచ్చి ప్రశ్నించగా, మద్యం ఉంది చూపిస్తా రండి అంటూ రైల్వే ట్రాక్‌ వైపుకు తీసుకువెళ్లి అక్కడనుంచి పరారయ్యాడు. పోలీసులు దాదాపు 2కి.మీ.లు వెంబడించి దొంతా శ్రీనును పట్టుకుని అతని వద్ద ఉన్న 5 కేసుల తెలంగాణ మద్యాన్ని సాకవధీనం చేసుకున్నారు. సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ భార్గవ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. a

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement