
సాక్షి, పశ్చిమగోదావరి: అక్రమ మద్యం కేసులో ఏఎస్‌ఐని అరెస్ట్ చేశారు. జీలుగుమిల్లి పీఎస్ పరిధి చెక్‌పోస్టు వద్ద నాలుగు రోజుల క్రితం రూ.20 లక్షలు విలువ చేసే అక్రమ మద్యం తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యంపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. విచారణలో మద్యం అక్రమ రవాణాకు ఏఎస్‌ఐ సహా ముగ్గురు సహకరిస్తున్నట్లు గుర్తించామని పోలవరం డీఎస్పీ తెలిపారు. ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. జీలుగుమిల్లి చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తూ.. మద్యం అక్రమ రవాణాకు సహకరిస్తున్న ఏఎస్‌ఐ శ్రీనివాస్‌తో పాటు జంగారెడ్డిగూడెంకు చెందిన ప్రసాద్, కాగితాల రామారావు, రమేష్ లను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment