చెట్టుకు కట్టేసి, కర్రలతో మర్మాంగాలపై దాడి.. వీడియో వైరల్‌ | Dalit Man Beaten Up, Hit On Privates In Uttar Pradesh | Sakshi
Sakshi News home page

 చెట్టుకు కట్టేసి, కర్రలతో మర్మాంగాలపై దాడి.. వీడియో వైరల్‌

Jul 10 2021 1:24 PM | Updated on Jul 10 2021 2:03 PM

Dalit Man Beaten Up, Hit On Privates In Uttar Pradesh - Sakshi

వీడియో నుంచి తీసిన ఫోటో

లక్నో: ఉత్తర ప్రదేశ్‌, కాన్పూర్ దేహాట్ జిల్లాలో  ఒక దళిత యువకుడి(20)పై దారుణంగా దాడి చేసిన ఘటన కలవరం రేపింది. ప్రేమ వ్యవహారం కారణంగా  యవకుడిని కులం అడిగి మరీ దారుణంగా దాడి చేసిన వైనం కలకలం సృష్టించింది. రెండు రోజుల క్రితం కాన్పూర్ దేహాట్ లోని అక్బర్పూర్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ అమానుషానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో  చక్కర్లు కొడుతోంది. 

తమ గ్రామంలోని అమ్మాయిని ప్రేమిస్తున్న కారణంగా  కొంతమంది  అతనిపై దృష్టిపెట్టారు.  అమ్మాయిని కలిసేందుకు గ్రామంలోకి వచ్చిన సదరు యువకుడిని  జుట్టు పట్టి లాక్కొచ్చారు. అతని కులం అడిగారు. ఆ తరువాత మరింత రెచ్చిపోయారు. కర్రలతో తీవ్రంగా  కొట్టారు.  మోకాళ్లతో తన్ని,  కర్రలతో విపరీతంగా  కొట్టారు. అంతటి వారి ఆగడం ఆగలేదు. బలవంతంగా అతణ్ణి చెట్టుకు కట్టేసి ఇష్టం వచ్చినట్టుగా చితకబాదారు. అతణ్ని పట్టుకుని మరీ మర్మాంగాలపై దాడి చేసిన వైనం వీడియోలో రికార్డైంది. బాధితుడి బంధువులు తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఫిర్యాదును స్వీకరించడానికి  పోలీసులు మొదట్లో నిరాకరించారని బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. 

మరోవైపు ఈ వీడియో సంచలనం రేపడంతో పోలీసులు స్పందించారు.  వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఇతర నిందితులను  పట్టుకునేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు  ఉన్నత అధికారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement