Crime: తాళిబొట్టే గొంతు కోసింది | Delhi Woman Dies After Mangalsutra Slits Throat | Sakshi
Sakshi News home page

Crime: తీవ్ర విషాదం.. తాళిబొట్టే ఆమె గొంతు కోసింది

Published Mon, Jul 4 2022 9:26 PM | Last Updated on Mon, Jul 4 2022 9:26 PM

Delhi Woman Dies After Mangalsutra Slits Throat - Sakshi

తాళిబొట్టే పాపం ఆమె పాలిట యమపాశం అయ్యింది. ఆమె గొంతు కోసి ప్రాణం తీసింది. ఢిల్లీ గాంధీనగర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది.

బీహార్‌ మధుబనికి చెందిన అనిల్‌ పాశ్వాన్‌, భార్యా రాధాదేవి కొడుకుతో పాటు గాంధీనగర్‌కు వలస వచ్చాడు. రఘుబీర్‌పురలో టైలర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రాధాదేవి మెట్ల మీద నుంచి జారిపడింది. ఈ క్రమంలో ఆమె తాళిబొట్టు మెడకు చుట్టుకుని కోసుకుపోయింది. ఆ గాయాలతోనే ఆమె అక్కడికక్కడే కన్నుమూసింది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మెడ చుట్టూ గాయాలు చూసి పోలీసులు తొలుత ఈ కేసులో అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే నాలుగేళ్ల కొడుకు.. టెర్రెస్‌ మీద నుంచి తన తల్లి మెట్ల మీద నుంచి జారిపడడం, ఆ సమయంలోనే మెడలోని తాళి కోసుకుపోయి చనిపోవడం గురించి ఏడుస్తూ పోలీసులకు వివరించాడు. ఆ సమయంలో భర్త కూడా దుకాణంలో ఉండడాన్ని నిర్ధారించుకుని.. ఈ కేసును ప్రమాదంగానే నమోదు చేసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement