![Film Writer Arrested Over Molesting Young Girl In Mumbai - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/22/writer.jpg.webp?itok=eMuU7e4p)
ముంబై : సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఓ సినీ రచయితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, మలద్ వెస్ట్‌కు చెందిన హరీష్ భీమ్‌సేన్ గడి తానో రైటర్‌నని, చాలా సినిమాల్లో పని చేశానని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. కొద్దినెలల క్రితం హార్యానాకు చెందిన 27 ఏళ్ల యువతికి హరీష్‌తో పరిచయం ఏర్పడింది. ( ఎంపీలు, ఎమ్మెలేలకు పోర్న్ వీడియోలతో ఎర!..)
ఈ నేపథ్యంలో ఆమెకు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని, రెండు వారాల్లో యాక్టింగ్ నేర్పిస్తానని నమ్మబలికాడు. వాలెంటైన్స్ డే రోజున తన ఇంట్లో పార్టీ జరుగుతోందని చెప్పి ఆమెను ముంబైకి పిలిపించాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు జాయింట్ కమిషనర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్‌ను కలిసి అతడిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం హరీష్‌ను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment