
తిరువొత్తియూరు: తన కోరిక తీర్చలేదని తమ్ముడి భార్యను.. బిడ్డతో సహా హత్య చేసి దహనం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం.. దిండుక్కల్ జిల్లా నత్తం సమీపంలోని మలయనూరు వలసు ప్రాంతానికి చెందిన నల్లపిచ్చన్ కుమారులు కరుప్పయ్య (30), శివకుమార్ (27). వీరిలో కరుప్పయ్యకు వివాహం కాలేదు. శివకుమార్‌కు అంజలి (21)తో వివాహం జరిగింది. వీరికి మలర్(2) కుమార్తె ఉంది. కాగా ప్రస్తుతం అంజలి నాలుగు నెలల గర్భిణి.
ఇదిలా ఉండగా.. శనివారం శివకుమార్ చింతపండు వ్యాపారం కోసం బయట ఊరికి వెళ్లాడు. సాయంత్రం సమయంలో అదే ప్రాంతంలో ఉన్న తోటలో చిన్నారి మలర్‌వితితో కలసి అంజలి మేకలు కాస్తూ ఉంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన కరుప్పయ్య ఒంటరిగా ఉన్న అంజలిని చూసి తన కోరికను తీర్చమని ఒత్తిడి చేశాడు. దీనికి అంజలి తిరస్కరించడంతో కరుప్పయ్య కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో తీవ్ర గాయాలతో ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందింది. తరువాత బిడ్డ మలర్ విలిని కూడా అతను నరికి హత్య చేశాడు. తర్వాత ఇద్దరి మృతదేహాలకు నిప్పు పెట్టి పారిపోయాడు.
దీంతో, ఆ ప్రాంతంలో పొగ రావడంతో స్థానికులు అక్కడికి వెళ్లి చూశారు. ఇద్దరి మృతదేహాలు కాలి పోతున్నట్లు గుర్తించి పోలీసులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు కరుప్పయ్యను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment