
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై: విడాకుల నోటీసులో సంతకం పెట్టడా నికి నిరాకరించిన భార్యను, అడ్డొచ్చిన కుమార్తెను కానిస్టేబుల్ కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ సంఘటన తిరువళ్లూరు జిల్లా మీంజూరులో కలకలం రేపింది. మీంజూరుకు చెందిన రాజేంద్రన్ చెన్నై సచివాలయం పరిధిలోని పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి అదే ప్రాంతానికి చెందిన పూర్ణిమతో 2005లో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
మగబిడ్డ పుట్టలేదని, విడాకుల నోటీసుపై సంతకం పెట్టాలని రాజేంద్రన్ గురువారం రాత్రి భార్యతో ఘర్షణకు దిగాడు. ఆమె అంగీకరించకపోవడంతో కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన కుమార్తెనూ గాయపరిచాడు. అనంతరం మీంజూరు పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని స్థానికులు చెన్నైకు తరలించారు.
చదవండి: యువతికి ఉద్యోగం ఆశ చూపి..
Comments
Please login to add a commentAdd a comment