
సాక్షి, రాయగడ: భార్య అశ్లీల చిత్రాలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన భర్తని పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన జిల్లాలోని గుణుపూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. బలంగీర్ జిల్లాలోని టిట్లాగడ్ పరిధిలోని జగన్నాథపడ గ్రామానికి చెందిన గోవిందరావుకి తన భార్యకి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీనిపై అతడి భార్య గుణుపూర్ పోలీస్‌స్టేషన్‌లో తన భర్త తనను వేధిస్తున్నాడని కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందిత భర్తని అరెస్ట్ చేసి, కోర్టుకి తరలించారు. చదవండి: (భార్య పుట్టింటికెళ్తే.. భర్త గోదావరిలో దూకి..)
అరెస్టయిన గోవిందరావుతో పోలీసులు
అనంతరం బెయిల్‌పై విడుదలైన అతడు మళ్లీ తన భార్యని చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభించాడు. దీంతో భర్త వేధింపులు తాళలేని ఆమె గుణుపూర్‌లోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడితో ఆగని అతడు తన భార్య అశ్లీల చిత్రాలను, అవమానకరమైన వ్యాఖ్యలతో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఘటనపై ఆవేదన చెందిన బాధితురాలు గుణుపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 12వ తేదీన ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. చదవండి: (పనిమనిషిపై మోజు... కటకటాలపాలు)