
సాక్షి,శంషాబాద్ రూరల్(హైదరాబాద్): కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసిన ఘటన ఆదివారం రాత్రి మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ముచ్చింతల్‌కు చెందిన వడ్డె కృష్ణ, నాగరాణి (28) దంపతులకు తరచూ గొడవలు జరుగుతుండేవి.
రాత్రి తాగిన మత్తులో కృష్ణ తన భార్య తలపై బండరాయితో మోది హత్య చేశాడు. తల్లిపై కూడా దాడి చేయడంతో ఆమెకు తీవ్రగాయాలు కాగా..సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఎదురింటి యువకుడితో వివాహేతర సంబంధం.. )
Comments
Please login to add a commentAdd a comment