( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టోనీని పోలీస్ కస్టడీకి అప్పగించడానికి నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్ టోనీని ఐదురోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. దీంతో రేపటి నుండి ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీలో టోనీని విచారించనున్నారు. టోనీకి హైదరాబాద్‌లోని బిజినెస్ మెన్స్‌కి సంబంధాలపై పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఏడు మంది వ్యాపారవేత్తలను అరెస్ట్ చేసిన పోలీసులు.. టోనీని మరింత లోతుగా విచారించి ఇంకా ఎవరున్నారనే దానిపై విచారణ చేపట్టనున్నారు.
డ్రగ్స్ కేసులో మరో 15 మంది వ్యాపారవేత్తలను పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో బడా పారిశ్రామిక వేత్తలుగా కొనసాగుతున్న గజేంద్ర, విపుల్‌లు టోనీ అనే వ్యక్తి దగ్గర్నుంచి కొన్నేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నారు.హైదరాబాదులో 500 కోట్ల పైచిలుకు వ్యాపారం చేస్తున్న వ్యాపారవేత్తలు.. మరో 15 మందికి టోనీ డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. గుర్తించిన 15 మంది వ్యాపారవేత్తల వద్ద వివరాలను సేకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment