ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై : పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తెను ఓ తంద్రి దారుణంగా హతమార్చిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. తెన్‌కాశీ జిల్లా ఊత్తమలైకి చెందిన మారిముత్తు (45) కుమార్తె షాలోంషీబా (19) అదే ఊరికి చెందిన బంధువు రాజ్ అనే యువకుడిని రెండేళ్లుగా ప్రేమిస్తోంది. వీరిప్రేమకు మారిముత్తు తీవ్ర అభ్యంతరం చెప్పడంతో వారు రెండుసార్లు ఇల్లు విడిచి వెళ్లగా మారిముత్తు వారిని వెతికి పట్టుకుని కుమార్తెను ఇంటికి తెచ్చాడు.
ఆరునెలల క్రితం మళ్లీ వెళ్లిపోయిన ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు. మారిముత్తు ఇంటికి సమీపంలోని మారియమ్మన్ ఆలయ ఉత్సవాలకు కుమార్తె, అల్లుడు హాజరయ్యారు. తల్లిదండ్రులను చూసేందుకు ఇంటికి వచ్చిన కుమార్తెను చూసి ఆగ్రహంతో ఊగిపోయిన మారిముత్తు వేటకొడవలితో నరికి పారిపోయాడు. తీవ్రగాయాలకు గురైన షీబా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. యువతి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment