![Karnataka: Girls Deceased Bus Conductor Move Bus Unexpectedly - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/25/BUS.jpg.webp?itok=2l4GRMOQ)
మైసూరు(బెంగళూరు): బస్ డ్రైవర్ నిర్లక్ష్యానికి యువతి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందింది. వివరాలు..నంజనగూడు తాలూకా హోస్కూరు గ్రామానికి చెందిన మహేశ్ కుమార్తె చందన (17) వళగెరె గ్రామం నుంచి సొంతూరుకు బస్సులో బయల్దేరింది. హోస్కూరు బస్టాండ్ వద్దకు రాగానే కిందకి దిగుతుండగా బస్సు ముందుకు కదిలింది. దీంతో చందన అదుపుతప్పి చక్రాల కింద పడి మరణించింది.
అయితే డ్రైవర్, కండక్టర్ బస్సును ఆపకుండా వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న హల్లరే గ్రామస్తులు బస్సును అడ్డుకున్నారు. హోస్కూరు గ్రామస్తులు, బాధితురాలి కుటుంబీకులు రోడ్డుపై ఆందోళన చేశారు. బస్ డ్రైవర్, కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment