
ముంబై: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం చోటుసుకుంది. మొబైల్ ఫోన్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన 15 ఏళ్ల బాలుడు పిడుగుపాటుకు మృతి చెందాడు. మరో ముగ్గురు పిల్లలకు గాయాలయ్యాయి. తహసీల్దార్ రాహుల్ సారంగ్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం దహను తాలూకాలోని మంకర్‌పాడ వద్ద నలుగురు బాలురు పశువులను మేపడానికి బయటకు వెళ్లారు.
సోమవారం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వాతవరణ ప్రతికూల పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ సిగ్నల్ కు రాలేదు. ఈ క్రమంలో మొబైల్ ఫోన్ సిగ్నల్ కోసం నలుగురు పిల్లలు కలిసి చెట్టెక్కారు. అదే సమయంలో ఒక్క సారిగా పిడుగు పడడంతో రవీంద్ర కోర్డా (15) అనే బాలుడు మృతి చెందాడు. మరో మగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా 14 నుంచి 16 సంవత్సరాల మధ్య ఉన్న వారే. గాయపడిన పిల్లల్ని కాసా గ్రామీణ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
చదవండి: మహిళకు ఒకే రోజు మూడు డోసుల వ్యాక్సిన్
Comments
Please login to add a commentAdd a comment