
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,హైదరాబాద్: ఇష్టపడ్డ మహిళ దక్కలేదని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొని మృతిచెందిన సంఘటన అమీన్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై కృష్టారెడ్డి వివరాల ప్రకారం అమీన్‌పూర్ టైలర్స్ కాలనీకి చెందిన శ్రీకాంత్‌రెడ్డి(35) చందనగర్‌లోని ఓ ఆస్పత్రిలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తుండగా, ఆయన భార్య అదే ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేసేది. కొడుకు పుట్టడంతో ఉద్యోగం మానేసింది. ఈ సమయంలో శ్రీకాంత్‌రెడ్డికి మరో స్త్రీతో పరిచయం ఏర్పడింది.
సదరు స్త్రీతో కలసి దిగిన ఫొటోలను చూసిన భార్య, భర్తను నిలదీసింది. ఆమె లేకపోతే బతకలేనంటూ శ్రీకాంత్‌రెడ్డి భార్యను బెదిరించాడు. ఈ క్రమంలో ఈనెల 9న భార్య తల్లిగారింటికి వెళ్లగా, శ్రీకాంత్ రెడ్డి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకునాన్నాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: Hyderabad: మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన ఓనర్ కొడుకు.. మూడు నెలలుగా..
Comments
Please login to add a commentAdd a comment