మైనర్‌ బాలికపై కీచక తండ్రి అత్యాచారం | Man Molested Daughter In Visakhapatnam POCSO Cases Registered | Sakshi
Sakshi News home page

మైనర్‌ బాలికపై కీచక తండ్రి అత్యాచారం

Published Wed, Jul 29 2020 9:41 AM | Last Updated on Wed, Jul 29 2020 12:40 PM

Man Molested Daughter In Visakhapatnam POCSO Cases Registered - Sakshi

దొండవర్తి (విశాఖ దక్షిణ): కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తండ్రే కుమార్తెపై అఘాయిత్యం చేశాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన నగరంలోని రైల్వే న్యూకాలనీ ప్రాంతంలో జరిగింది. కూతురుని బెదిరించి గత ఆరు నెలలగా అత్యాచారానికి పాల్పడిన కీచక తండ్రి బాగోతం మంగళవారం బయటపడింది. నాలుగో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖకు చెందిన ఎమ్. భాస్కరరావు (35) ప్రైవేట్‌ ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా కోల్‌కతాలో కొన్నాళ్లు పని చేసి అనంతరం నగరానికి తిరిగి వచ్చాడు. తన తండ్రి రైల్వే ఉద్యోగిగా రిటైర్ కావడంతో వాళ్ళతోనే ఉంటున్నాడు. 

కాగా భాస్కరరావు భార్య 2016లో బ్రెస్ట్ కేన్సర్ కారణంగా మృతి చెందింది. తల్లికి పక్షవాతం, తండ్రి వృద్ధాప్యంలో ఉండడంతో భాస్కరరావు ఒక్కగానొక్క కుమార్తె (14) ఆ ఇంటి పనులన్నీ చూస్తుంది. ఈ నేపథ్యంలో భాస్కరరావు ఇతర ప్రాంతాలకు పనులకు వెళ్లి కేవలం శని, ఆది వారాలు మాత్రమే ఇంటికి వస్తు ఉండేవాడు. కుమార్తె ఒక్కతే కావడం తల్లి దండ్రులు వృద్ధులు కావడంతో కుమార్తెపై అతని కన్ను పడింది. రవీంద్ర భారతి స్కూల్‌లో 8వ తరగతి పాసైన కుమార్తెకు తొమ్మిదో తరగతి చదివేందుకు ఫీజు కూడా చెల్లించాడు. 
(చదవండి: లాక్‌డౌన్‌ కష్టాల్లో రష్యన్‌ యువతి)

ఇదిలావుండగా పెళ్లి అయ్యాక అనుభవం ఉండాలని కూతురుకి విద్యా బుద్ధులు నేర్పించాల్సిన భాస్కరరావు బరితెగించాడు. అభం శుభం తెలియని కుమార్తెతోనే కామ కలాపాలు చేసేవాడని పోలీసులు తేల్చారు. పెళ్లయ్యాక ఇలాంటి అనుభవం కావాలంటూ మైనర్‌ బాలికను తమ గదిలో నిత్యం చెరబెట్టేవాడు. అయితే, ఆమెకు ఇటీవల కడుపులో నొప్పిగా ఉందని తండ్రికి చెప్పడంతో సమీపంలోని ఓ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు బాలికకు కొన్ని టెస్టులతో పాటు స్కానింగ్ కూడా చేయగా అప్పటికే ఆ మైనర్‌ రెండున్నర నెలల గర్భవతిగా బయట పడింది. దీంతో ఆస్పత్రి యాజమాన్యం కేసును కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. 

రంగంలోకి దిగిన నాలుగో పట్టణ పోలీసులు, దిశ మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది. వివిధ ప్రభుత్వ విభాగాల సిబ్బంది కేజీహెచ్ కు చేరుకుని వివరాలు ఆరా తీశారు. తల్లి, దండ్రులు ఒక గదిలోనూ, కుమార్తెతో కలిసి భాస్కరరావు మరో గదిలోను ఉండేవారని పోలీసులు తేల్చారు. అత్యంత నీచమైన స్థితికి పాల్పడిన భాస్కరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. బాలికను వైద్య పరీక్షల అనంతరం షెల్టర్‌కు చేరుస్తామని అధికారులు తెలిపారు. నిందితుడిపై పోస్కో తో పాటు అక్రమ నిర్భంధం, మాయ మాటలు చెప్పి లొంగదీసుకోవడం, మానభంగానికి సంబంధించిన సెక్షన్లు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
(కనురెప్పలే కాటేస్తున్నాయి..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement