సాక్షి, చెన్నై: పొల్లాచ్చి సమీపంలోని తమ్మంపట్టి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోవైజిల్లా పొల్లాచ్చి సమీపంలోని తమ్మంపట్టి గ్రామానికి చెందిన మణికంఠన్ కూలి కార్మికుడు. ఇతని భార్య సరోజిని. వీరికి నవన్యాశ్రీ (3) కుమార్తె ఉంది. శనివారం సాయంత్రం సరోజినీ తన బిడ్డతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బిడ్డ సృహ తప్పి పడి మృతి చెందిందని చెప్పి.. ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అక్కడ పరిశీలించిన వైద్యులు బిడ్డ మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి బిడ్డ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఇందులో బిడ్డ గొంతు నులిమి హత్య చేయబడినట్లు తెలిసింది. దీంతో పోలీసులు సరోజిని ప్రశ్నించగా.. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతో బిడ్డను హత్య చేసినట్లు తెలిపింది. దీంతో సరోజినిపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment