ప్రతీకాత్మక చిత్రం
అన్నానగర్(చెన్నై): వేపూర్ సమీపంలో ఆదివారం ఊయల ఊగుతున్న బాలుడు మెడకు చీర చుట్టుకుని ఊపిరాడక మృతి చెందాడు. కడలూరు జిల్లా వేపూర్ పక్కనే ఉన్న మాతూరు గ్రామానికి చెందిన వెంకటేశన్, సుమతి దంపతులకు శక్తి (11) అనే కుమారుడు ఉన్నాడు. వెంకటేశన్ తన కుటుంబంతో కలిసి బెంగళూరులో ఉంటూ అక్కడ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
వేసవి సెలవుల కోసం స్వగ్రామానికి వచ్చాడు. సుమతి ఆదివారం తన స్నేహితులను చూసేందుకు భర్తతో కలిసి కళ్లకురిచ్చి జిల్లా ఆసనూరుకు వెళ్లింది. కుమారుడు శక్తిని వెంకటేశన్ తల్లి మురువై వద్ద వదిలిపెట్టారు. ఆ సమయంలో శక్తి ఇంట్లోని చెట్టుకు చీరతో ఊయల కట్టి ఆడుకుంటున్నాడు. అనుకోకుండా చెట్టుకి కట్టిన చీర శక్తి మెడకి చుట్టుకుంది. దీంతో ఊపిరాడక బాలుడు స్పృహతప్పి పడిపోయాడు. గమనించిన ఇరుగుపొరుగు వారు బాలుడిని విరుదాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతిచెందినట్టు తెలిపారు. వేపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ‘నాన్న నేను లాయర్ అవుతానని చెప్పి.. ఉన్మాది కత్తికి బలైంది’
Comments
Please login to add a commentAdd a comment