మెగా ఇంట్లో పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైంది. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి నవంబర్ 1న వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ పెళ్లి వేడుక కోసం ఇప్పటికే మెగా ఫ్యామిలీతో పాటు అల్లు అర్జున్ కూడా ఇటలీ చేరుకున్నారు. ఇటలీలోని టుస్కానీ నగరంలో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ఇప్పటికే వెడ్డింగ్ సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈనెల 31న హల్దీ, మెహందీ వేడుకలతో పెళ్లిసందడి మొదలు కానుంది.
(ఇది చదవండి: ఇటలీలో వాలిపోయిన మెగా ఫ్యామిలీ.. క్లీంకార విషయంలో పెద్ద పొరపాటు!)
అయితే సెలబ్రిటీల పెళ్లి అంటే దుస్తుల ఎంపికలోనూ ప్రత్యేకంగా కనిపిస్తారు. స్పెషల్‌గా డిజైన్ చేసిన డ్రెస్సులనే వెడ్డింగ్‌లో ధరిస్తారు. కానీ కాబోయే మెగా కోడలు కూడా ఓ సంప్రదాయాన్ని ఫాలో అవుతోంది. హల్దీ వేడుక కోసం కాబోయే వధువు లావణ్య త్రిపాఠి తన తల్లి చీర కట్టుకోనుంది. తన తల్లి చీరను కేప్ లెహంగాలో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే గతంలో నిహారిక కొణిదెల సైతం తన పెళ్లి వేడుకలో తల్లి చీరను ధరించింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ పెళ్లాడబోతున్న లావణ్య త్రిపాఠి అదే ట్రెండ్‌ను ఫాలో అవుతోంది. తన తల్లి దుస్తులనే ధరించాలని నిర్ణయించుకుంది. మరోవైపు వరుణ్ తేజ్ హల్దీ వేడుకలో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన పసుపు కుర్తా ధరించి కనిపించనున్నారు. కాగా.. గతంలో కరీనా కపూర్ ఖాన్, యామీ గౌతమ్, మిహీకా బజాజ్ కూడా ఇదే ట్రెండ్‌ను కొనసాగించారు.
(ఇది చదవండి: 'సీతారామం' బ్యూటీ తెలుగింటి కోడలు కానుందా?)
Comments
Please login to add a commentAdd a comment