
తల్లి వెర్ఫీ కుడితో ఆషిహ కుడి
లండన్ : 20 నెలల చంటి బిడ్డను ఒంటరిగా ఇంట్లో వదిలేసి ఆరు రోజుల పాటు పార్టీలకు వెళ్లిందో తల్లి. తిండి, నీళ్లు లేక ఆ బిడ్డ మృత్యువాత పడింది. పసిబిడ్డ చావుకు కారణమైన తల్లి హత్యానేరంతో జైలుపాలైంది. ఇంగ్లాండ్‌లోని లండన్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన కేసుపై లూవెస్ క్రౌన్ కోర్టు శుక్రవారం విచారణ జరిపింది. నిందితురాలు తాను చేసిన నేరాన్ని కోర్టులో అంగీకరించి, కన్నీరు మున్నీరుగా విలపించింది. విచారణను మే 28కి వాయిదా వేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
కేసు వివరాలు.. బ్రింగ్టన్‌కు చెందిన వెర్ఫీ కుడి.. 2019 డిసెంబర్‌లో తన పుట్టిన రోజు సందర్భంగా లండన్‌లో ఆరు రోజుల పాటు పార్టీలకు వెళుతూ కూతురు ఆషిహ కుడిని ఇంట్లోనే వదిలేసింది. పార్టీలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చింది. అయితే కూతురు ఆషిహ ఆరురోజుల పాటు తిండి, నీరు లేక చనిపోయింది. కూతురు ఎంత పిలిచినా లేవకపోయే సరికి ఆమె 999కు ఫోన్ చేసింది. అనంతరం బాలికను ఆసుపత్రికి తరలించారు. పాప అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెర్ఫీని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment