తమ్మరాజుపల్లె, గుర్రంపాలెంలో ప్రగతిపనుల శిలాఫలకాలు ధ్వంసం
నరసరావుపేటలో జగనన్నకాలనీ శిలాఫలకం మాయం
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు విధ్వంస కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నారు. ప్రగతిపనుల శిలాఫలకాన్ని ముక్కలు చేస్తున్నారు. వీరి అరాచకాలు శనివారం రాత్రి, ఆదివారం కూడా కొనసాగాయి.
» నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లెలో హెల్త్‌సెంటర్ ప్రారం¿ోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అప్పటి సీఎం వైఎస్ జగన్, అప్పటి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ముక్కలు చేశారు. ప్రభుత్వ భవనానికి ఉన్న నవరత్నాల లోగోకు రంగులు వేశారు. దీనిపై గ్రామ వైఎస్సార్‌సీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారిస్తున్నారు.
» కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రంపాలెంలో గత ప్రభుత్వం హయాంలో రక్షిత మంచినీటి పథకం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనిపై గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత, జగ్గంపేట వైస్ ఎంపీపీ నక్కా వెంకట్రావు (శ్రీను) ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్రంపాలెంలోని సగరుపేటలో నిర్మించిన రక్షిత మంచినీటి పథకాన్ని ఈ ఏడాది మార్చి 2న అప్పటి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, చంటిబాబు చిత్రపటాలను ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి 9 గంటల వరకూ శిలాఫలకం బాగానే ఉందని, అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు దీనిని గునపంతో ధ్వంసం చేశారని శ్రీను తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘటన స్థలాన్ని జగ్గంపేట ఎ.ఎస్.ఐ. సుబ్బారావు ఆధ్వర్యాన పోలీసులు పరిశీలించారు. ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయకపోవడంతో ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.
» పల్నాడు జిల్లా నరసరావుపేటలో సుమారు ఏడువేలమందికి గృహనిర్మాణ పట్టాల పంపిణీ, వసతి కలి్పంచిన వినుకొండ రోడ్డులోని జగనన్న కాలనీ ప్రారం¿ోత్సవ శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు మాయం చేశారు. ఈ విషయాన్ని స్థానికులు ఆదివారం గుర్తించారు.
2021 జనవరి మూడో తేదీన అప్పటి గృహనిర్మాణశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఈ కాలనీకి భూమిపూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. కాలనీలో సుమారు 500 మంది ఇళ్లు నిరి్మంచుకుని ఉంటున్నారు. కొన్ని గృహాలు నిర్మాణంలో ఉన్నాయి. శిలాఫలకాన్ని మాయం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment