చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం | Road Accident At Chittoor District | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం

Published Sun, Aug 30 2020 11:10 AM | Last Updated on Mon, Aug 31 2020 3:28 PM

Road Accident At Chittoor District - Sakshi

సాక్షి, చిత్తూరు : జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు ద్మురణం చెందారు. బంగారుపాళెం మండలం మొగలి వద్ద ఇవాళ ఉదయం ఓ కారు ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. ఎదురుగా వచ్చిన టీవీఎస్‌ మోపెడ్‌ను చూసిన వెంటనే వేగాన్ని నియంత్రించలేకపోవడంతో అదుపు తప్పి లారీని ఢికొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు, బైక్‌పై వెళుతున్న వ్యక్తి మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మృతులు బెంగుళూరుకు చెందిన వారు. వీరంతా బెంగళూరు నుంచి నెల్లూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు శ్రీనివాసులు, రత్నమ్మ, వెంకటేష్‌గా పోలీసులు గుర్తించారు. మరొకరు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement