కడప సెంట్రల్ జైలుకు జేసీని తరలిస్తున్న పోలీసులు
తాడిపత్రి/కడప అర్బన్ /అనంతపురం క్రైం: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మళ్లీ జైలుపాలయ్యారు. తాడిపత్రి సీఐ దేవేంద్రను కులం పేరుతో దూషించడంతో పాటు కరోనా నిబంధనల ఉల్లంఘన, అధికారులకు బెదిరింపులకు సంబంధించి ఆయనపై తాడిపత్రి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటితో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
జేసీ బెయిల్‌పై గురువారం విడుదలయ్యాక కడప కారాగారం వద్ద కరోనా నిబంధనలను ఉల్లంఘించారు. దీంతో ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి, జేసీ పవన్‌కుమార్‌రెడ్డిలతోపాటు 31 మందిపై రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే జేసీ భారీ కాన్వాయ్‌తో తాడిపత్రి వస్తూ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న సీఐ దేవేంద్రను కులం పేరుతో దూషించారు. దీంతో శుక్రవారం అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు సంతకాలు చేసేందుకు వచ్చిన జేసీని తాడిపత్రి డీఎస్పీ అరెస్ట్ చేశారు. గుత్తి మేజిస్ట్రేట్‌లో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం జేసీని కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment