కుటుంబీకుల మృతదేహాలు బయల్పడిన ఇల్లు
భువనేశ్వర్/బలంగీరు: బలంగీరు జిల్లా పట్నగడ్ పోలీస్‌స్టేషన్ పరిధి సొంవొరొపొడా గ్రామంలో ఓ ఇంట్లో ఆరుగురు కుటుంబ సభ్యుల మృతదేహాలు అనుమానాస్పద పరిస్థితుల్లో కనిపించడం తీవ్ర సంచలనం రేపింది. బుధవారం ఉదయం ఈ విషాదకర దృశ్యం వెలుగుచూసింది. ఈ సంఘటనపట్ల స్థానికులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పట్నగడ్ స్టేషన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌చార్జి ప్రియాంక రౌత్రాయ్ ఆధ్వర్యంలో ఘటనా స్థలంలో చేపట్టిన గాలింపులో ఓ గదిలో కంబళిలో మృతదేహాల్ని కనుగొన్నారు. (కొద్ది నిమిషాల్లో పెళ్లి.. అంతలోనే మరో యువతి..)
మృతులను గ్రామానికి చెందిన బుల్లు జానీ, ఆయన భార్య, ముగ్గురు కొడుకులు, ఒక కూతురుగా గుర్తించారు. దాదాపు 10 ఏళ్లుగా బుల్లు జానీ తేనె సేకరించి విక్రయిస్తూ కుటుంబ పోషణ కొనసాగిస్తున్నాడు. ఈ కుటుంబీకుల అనుమానస్పద మృతిపట్ల దర్యాప్తు జరిపేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పరిసరాల్ని పర్యవేక్షించి పోస్ట్‌మార్టం కోసం మృతదేహాల్ని తరలించారు. పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడైతే తప్ప ఈ సంఘటన ఆత్మహత్యలా, హత్యలా అన్న విషయం స్పష్టం కాదని పోలీసులు పేర్కొన్నారు. అయితే మృతదేహాల పక్కన ఓ గొడ్డలి పడి ఉండడంతో ఇది హత్యా సంఘటనగా అనుమానాలు బలపడుతున్నాయి.
(భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం)
Comments
Please login to add a commentAdd a comment