
ముంబై : మరాఠీ నటితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై అంథేరీలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత బుధవారం మరాఠీ నటి మానసి నాయక్ స్నేహితురాలుతో కలిసి అంథేరీలోని ఓ సూపర్ మార్కెట్‌కు వెళ్లింది. అక్కడ క్యూలో నిల్చుని ఉండగా మెహ్‌రజ్ నిశ్శార్ అజ్మి, సూర్య రమేశ్ దూబెలు మాస్కులు లేకుండా, భౌతిక దూరాన్ని పాటించకుండా కనిపించారు. దీంతో ఆమె మాస్కు ధరించాలని, దూరం పాటించాలని హితవు పలికింది. (సుశాంత్ మృతి కేసులో కీలక మలుపు)
ఈ నేపథ్యంలో వారి మధ్య గొడవ మొదలైంది. ఆ వ్యక్తులిద్దరూ అసభ్యకరంగా ప్రవర్తించడటంతో ఆమె అక్కడినుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. పోలీసులకు ఫిర్యాదు చేసి, వారిని వెంట బెట్టుకుని మార్కెట్ వద్దకు తీసుకువచ్చింది. అక్కడకు చేరుకున్న పోలీసులు ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. అనంతరం వారికి నోటీసులు ఇచ్చి ఇంటికి పంపించేశారు.
Comments
Please login to add a commentAdd a comment