ప్రతీకాత్మక చిత్రం
ముంబై : ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ అధికారులే టార్గెట్‌గా సాగుతున్న సెక్స్‌టార్సన్ రాకెట్ ముఠా గుట్టురట్టయింది. ఈ రాకెట్‌తో సంబంధం ఉన్న రాజస్తాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గుర్ని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ అధికారులను టార్గెట్‌గా చేసుకుంటుంది. మహిళలకు సంబంధించిన ఫేక్ ఫ్రొఫైల్స్ ద్వారా వారితో పరిచయం పెంచుకుంటుంది. అనంతరం వారాంతాలలో వాట్సాప్ వీడియోకాల్స్ ద్వారా మరింత దగ్గరవుతుంది. కొంతకాలం తర్వాత పోర్న్ వీడియోలు చూసేలా వారిని ప్రోత్సహిస్తుంది. పోర్న్ వీడియోలు చూస్తున్న సమయంలో ఓ యాప్ ద్వారా వారి ముఖ కవలికలను రికార్డ్ చేస్తుంది. ( వికారాబాద్‌లో మాజీ ఎంపీపీ భర్త దారుణ హత్య)
ఆ తర్వాత ఆ వీడియోలను ఎడిట్ చేసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతుంది. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామంటూ డబ్బులు డిమాండ్ చేస్తుంది. మొదట్లో తక్కువ మొత్తం డబ్బులు.. ఆ తర్వాత పెద్ద మొత్తం అడగటం మొదలుపెడతారు. ఈ గ్యాంగ్ 171 ఫేక్ ఫేస్‌బుక్ ఖాతాలు, నాలుగు టెలిగ్రామ్ ఛానల్‌లు.. 54 మొబైల్ ఫోన్లు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత 58 బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. ( కరోనా విజృంభణ.. 1,305 భవనాలకు సీల్ )
Comments
Please login to add a commentAdd a comment