
ప్రతీకాత్మక చిత్రం
ముంబై : క్వారంటైన్ సెంటర్‌లో మహిళను దోచేశారు దొంగలు. గదిలో దాచుకున్న 3.5 లక్షల రూపాయలు విలువచేసే సొమ్మును దొంగిలించారు. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దోంబివాలాకు చెందిన 34 ఏళ్ల మహిళ కొద్దిరోజుల క్రితం కరోనా పాజిటివ్ రావటంతో పిల్లలతో కలిసి క్వారంటైన్ సెంటర్‌లో చేరింది. అక్కడ ఏవో పరీక్షల కోసం వారు ఉంటున్న గది నుంచి పిల్లలతో కలిసి వేరే గదికి వెళ్లింది. (రవీంద్ర భారతి వద్ద కలకలం )
పరీక్షలు చేయించుకున్న తర్వాత తిరిగొచ్చి చూస్తే.. మంగళసూత్రం, రెండు చైన్‌లు, నాలుగు వేల రూపాయల నగదు కనిపించలేదు. దీంతో ఆమె క్వారంటైన్ అధికారుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment