సీఎం పర్సనల్‌ సెక్రటరీనంటూ.. | Young Man Trying To Cheat People By The Name Of Telangana CM Personal Secretary | Sakshi
Sakshi News home page

సీఎం పర్సనల్‌ సెక్రటరీనంటూ..

Published Sat, Aug 22 2020 4:07 PM | Last Updated on Sat, Aug 22 2020 8:51 PM

Young Man Trying To Cheat People By The Name Of Telangana CM Personal Secretary - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు పర్సనల్‌ సెక్రటరీనంటూ నమ్మించి ప్రజలను మోసం చేయటానికి ప్రయత్నించిన యువకుడు అరెస్ట్‌ అయ్యాడు. శనివారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. తిమ్మాపూర్‌ మండలం, మొగిలిపాలెం గ్రామానికి చెందిన సాయి చందన్‌ కరీంనగర్‌లోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్నాడు. సీఎం అడిషినల్‌ సెక్రటరీగా, రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబాల వ్యవహారాలను చూస్తుండటంతో పాటు అవినీతి నిరోధక విభాగం కరీంనగర్ జిల్లా ఛైర్మన్‌గా కొనసాగుతున్నానని చెప్పుకుంటూ గత కొద్ది నెలలుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. సీఎం కార్యాలయానికి చెందిన రాజశేఖర్ రెడ్డి పేరు మీద నకిలీ నియామకపు ఉత్తర్వులు సృష్టించాడు. ( టీఆర్‌ఎస్‌ నేత హత్య.. భార్యపై అనుమానం?)

ఉత్తర్వుల ఆధారంగా చేసుకొని సీఎం దగ్గర పని చేస్తున్నానని చెబుతూ, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో దిగిన ఫోటోలను చూపిస్తూ ప్రజలను మోసం చేసేందుకు యత్నించాడు. సాయి చందన్‌ సీఎం ఆఫీస్ ఉత్తర్వులు, నకిలీ అవినీతి నిరోధక శాఖ ఛైర్మన్ గుర్తింపు కార్డులతో మోసాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్  పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అతని మోసాలు బయటపడ్డాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement