
అమలాపురం టౌన్: అమలాపురం మహిపాల వీధిలోని అబ్బిరెడ్డి కుటుంబానికి నాలుగు తరాలుగా చెడీ తాలింఖానా చరిత్ర ఉంది. నాలుగో తరంలో అబ్బిరెడ్డి నరసింహరావు, సురేష్, మల్లేష్ సోదరులు. దసరా ఉత్సవాల సందర్భంగా వీరు ఏటా మహిపాల వీధి ఊరేగింపులో చెడీ తాలింఖానా వీరవిద్యను ప్రదర్శిస్తారు.
ముగ్గురి సోదరుల్లో సురేష్ అమలాపురంలోనే నివాసం ఉంటున్నారు. మిగిలిన ఇద్దరూ ఉద్యోగాల రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. అయినా ఏటా దసరా ఉత్సవాలకు అమలాపురానికి వచ్చి చెడీ తాలింఖానా వీరవిద్యను ప్రదర్శిస్తారు. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా అబ్బిరెడ్డి నరసింహరావు, మల్లేష్ మూడు రోజుల కిందటే అమెరికా నుంచి అమలాపురానికి వచ్చారు. దసరా ఉత్సవాల్లో చెడీ తాలింఖానా విద్యను ప్రదర్శించనున్నారు.
స్థానిక మహిపాలవీధిలో చెడీ తాలింఖానాకు 1856లో బీజం పడింది. 169 ఏళ్ల చరిత్రలో తొలి తరం గురువు అబ్బిరెడ్డి రామదాసు, రెండో తరం గరువు రామదాసు కుమారుడు నరసింహరావు, మూడో తరం గురువు నరసింహమూర్తి కుమారుడు రామదాసు, నాలుగో తరంగా రామదాసు కుమారులైన నరసింహరావు, సురేష్, మల్లేష్ ప్రస్తుతం మహిపాలవీధి చెడీ తాలింఖానా ప్రదర్శనలను పర్యవేక్షిస్తున్నారు. ఆ వీధిలో మూడు తరాల గురువుల విగ్రహాలను నెలకొల్పారు.