
సత్యదేవునికి ఘనంగా ఏకాదశి పూజలు
అన్నవరం: ఫాల్గుణ బహుళ ఏకాదశి సందర్భంగా రత్నగిరి వాసుడు సత్యదేవునికి అర్చకులు మంగళవారం ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు స్వర్ణ పుష్పార్చన, 9 నుంచి 11 గంటల వరకూ పుష్పార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారికి నీరాజన మంత్రపుష్పాలు, వేదాశీస్సులు అందజేశారు.
ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, వేద పండితులు యనమండ్ర శర్మ ఘనపాఠి, అర్చకులు వేంకటేశ్వర్లు, పరిచారకులు యడవిల్లి ప్రసాద్, కొండవీటి రాజా తదితరులు ఈ కార్యక్రమాలు నిర్వహించారు. సత్యదేవుని దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామివారిని సుమారు 20 వేల మంది దర్శించారు. వెయ్యి వ్రతాలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.20 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 4 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment