
అంబేడ్కర్‌కు ఘన నివాళి
కొత్తపేట: భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక బండారుపేటలో జిల్లా వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్‌రాజు, మండల యువజన విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి స్వరూప్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి జగ్గిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ అసమానతలతో అనేక వర్గాలు అవమానాలు ఎదుర్కొంటున్న పరిస్థితులను రూపుమాపి సమసమాజ నిర్మాణానికి, అన్ని వర్గాల ఆర్థిక స్వాతంత్య్రానికి అనుగుణంగా దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేడ్కర్ అని అన్నారు. అనంతరం బాలలకు పుస్తకాలు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్గన గంగాధరరావు, అవిడి సర్పంచ్ రెడ్డి చంటి, ఎంపీటీసీ సభ్యులు పేపకాయల బ్రహ్మానందం, ముళ్ల జనార్దన్, గ్రామ పార్టీ అధ్యక్షుడు సలాది బ్రహ్మాజీ పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో..
అమలాపురం రూరల్: అంబేడ్కర్ ఒక వ్యక్తి మాత్రమే కాదు.. ఒక భావజాలమని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ గోదావరి భవన్‌లో అంబేడ్కర్ 134 వ జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ అంబేడ్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గోదావరి భవన్‌లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి సభలో కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేడ్కర్ కీలక పాత్ర పోషించారన్నారు. జాయింట్ కలెక్టర్ టీ. నిషాంతి మాట్లాడుతూ..అంబేద్కర్ జీవితం ఒక వ్యక్తిగత గాధ మాత్రమే కాదని కోట్లాదిమంది శోషితుల ఆశ, నమ్మకం, మార్గదర్శనమని అన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి బీవీఎన్‌ఎల్ రాజకుమారి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎం. జ్యోతిలక్ష్మిదేవి, దళిత జేఏసీ నాయకులు జంగా బాబురావు, ఎంఏ కేభీమారావు, ఇసుకుపట్ల రఘబాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఎస్పీ కృష్ణారావు నివాళి
స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి ఎప్పీ బి.కృష్ణారావు పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను మనమంతా ఆదర్శంగా స్వీకరించి ముందుకు సాగినప్పుడు సమ సమాజం సాకారమవుతుందని ఆయన అన్నారు. ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్, ఆర్మ్‌డ్ డీఎస్పీ సుబ్బరాజు, ఎీస్సీ సీఐ బి.రాజశేఖర్, డీసీఆర్‌బీ సీఐ వి.శ్రీనివాస్‌తోపాటు ఎస్పీ కార్యాలయం ఎస్సైలు, సిబ్బంది అంబేడ్కర్‌కు నివాళులర్పించారు.

అంబేడ్కర్‌కు ఘన నివాళి

అంబేడ్కర్‌కు ఘన నివాళి