
నిడదవోలు రూరల్: స్కూటర్‌పై నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి ఓ వ్యక్తి ఆదివారం మృతి చెందినట్లు సమిశ్రగూడెం ఎస్సై ఎస్‌ఎన్‌వీవీ రమేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని శెట్టిపేట గ్రామానికి చెందిన మెరకనపల్లి ప్రసన్నకుమార్ (55), భార్య ప్రియదర్శిని, ఇద్దరు పిల్లలతో నిడదవోలులో నివాసం ఉంటున్నారు. నిడదవోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రసన్నకుమార్ ఇంగ్లిష్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.
వేలివెన్ను శశి కళాశాలలో ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలకు చీఫ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించేందుకు ఇంటి నుంచి ఎలక్ట్రికల్ స్కూటర్‌పై బయలుదేరి వెళుతుండగా సమిశ్రగూడెం శివారులోని హెడ్‌లాక్ వద్ద ప్రమాదవశాత్తూ జారిపడ్డారు. దీంతో తలకు తీవ్రగాయాలై ఘటనా స్థలంలోనే తన భర్త మృతి చెందినట్లు భార్య ప్రియదర్శిని ఫిర్యాదు ఇచ్చారు.
ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడు ప్రమాదశాత్తూ పడిపోయాడా.. లేకుంటే ఇతర ఏ వాహనమైనా ఢీకొట్టిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. లెక్చరర్ ప్రసన్నకుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు ప్రభుత్వాసుపత్రిలో మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ ప్రమాద వివరాలు తెలుసుకుని వారిని ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment