త్వరలో సైన్స్ సెంటర్ ప్రారంభం
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులో కొత్తగా నిర్మించిన సైన్స్ సెంటర్‌ను (విజ్ఞాన కేంద్రం) త్వరలో ప్రారంభించనున్నామని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. ఈ కేంద్రంలోని వివిధ విభాగాలను సోమవారం ఆమె పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థులు తమ విజ్ఞానాన్ని పెంచుకునేందుకు, నూతన ఆవిష్కరణలు చేపట్టడానికి ఈ విజ్ఞాన కేంద్రం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. ఇందులో 18 సాంకేతిక ప్రదర్శనలు ఉన్నాయని, ఓపెన్ గ్రౌండ్‌లో సైన్స్ పార్క్ ఉందని చెప్పారు. రన్ నియన్స్ గ్యాలరీలో ఫిజిక్స్, మ్యాథ్స్‌కు సంబంధించి 33 విజ్ఞాన అంశాలున్నాయని తెలిపారు. అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. విద్యా సదస్సులు, సైన్స్ వర్క్‌షాపుల నిర్వహణకు ఈ విజ్ఞాన కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. వాటర్ వరల్డ్ గ్యాలరీలో వర్చువల్ మ్యూజియం, 35 ప్రదర్శనలు ఉన్నాయన్నారు. ‘ఎ జర్నీ విత్ లైట్‘పై స్పేస్, గెలాక్సీ, సౌర వ్యవస్థ, గ్రహాలతో కూడిన 20 ప్యానల్స్ ఉన్నాయని తెలిపారు. రోబోటిక్స్ కోసం ఒక ల్యాబ్ ఏర్పాటు చేశారన్నారు. రోబోల తయారీపై డిగ్రీ చదివిన విద్యార్థులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. ఇన్నోవేషన్ హబ్‌లో 51 అంశాలున్నాయని తెలిపారు. ప్రాజెక్టు కో ఆర్డినేటర్ మేకా సుసత్యరేఖ సైన్స్ సెంటర్ ప్రత్యేకతలను కలెక్టర్‌కు వివరించారు. కార్యక్రమంలో జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి వాసుదేవరావు, రూరల్ తహసీల్దార్ జయసూర్యకుమార్, ఎంపీడీఓ డి.శ్రీనివాసరావు, ఈఓ పీఆర్ అండ్ ఆర్‌డీ ఆర్మ్‌స్ట్రాంగ్, పంచాయతీ కార్యదర్శి జి.కాశీ విశ్వనాథ్, సైన్స్ సెంటర్ ఫీల్డ్ ఆఫీసర్ వై.దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment