ఆటల్లో గెలుపు ఓటములు సహజం
● భారత మాజీ హాకీ కెప్టెన్ ధనారాజ్ పిళ్ళై
● ముగిసిన ఆలిండియా సివిల్
సర్వీసెస్ హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఆటల్లో గెలుపు ఓటములు సహజం అని భారత హాకీ మాజీ కెప్టెన్ ధనరాజ్ పిళ్ళై పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా క్రీడామైదానంలో ఆలిండియా సివిల్ సర్వీసెస్ పురుషులు, మహిళల హాకీ పోటీలు ముగిశాయి. ముగింపోత్సవానికి టోర్నమెంట్ చీఫ్ కో–ఆర్టినేటర్, డిఎస్‌డీఓ బి.శ్రీనివాస్ కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ఒలింపియన్, భారత హాకీ జట్టు కెప్టెన్‌ఽ ఒలింపియన్, ధనరాజ్ పిళ్ళై, గౌరవ అతిథిగా ఏపీ, తెలంగాణ ఇన్‌కమ్ టాక్స్ డైరెక్టర్ ఆనంద్ రాజేశ్వర్ భాయ్‌వార్ హాజరయ్యారు. ధనరాజ్ మాట్లాడుతూ పోటీలలో విజేతలుగా నిలిచిన సెంట్రల్ సెక్టార్ జట్టు, ఒడిశా జట్టును ఆయన అభినందించారు. ఈ పోటీలలో దేశవ్యాప్తంగా 44 జట్లు పాల్గొన్నాయి. పురుషుల విభాగంలో సెంట్రల్ సెక్టార్ ప్రథమ, హైదరాబాద్ సెక్టార్ ద్వితీయ, హర్యానా తృతీయస్థానాలు, మహిళల విభాగంలో ఒడిశా మొదటి, సెంట్రల్‌సెక్టార్ రెండవ, హర్యానా మూడవ స్థానాలు గెలుచుకున్నాయి. విజేతలకు అతిధులు బహుమతులు అందజేశారు. టోర్నమెంట్ స్పాన్సర్స్‌కు అతిధులు చేతుల మీదుగా మెమెంటోలు ఇచ్చారు. టోర్నమెంట్ కన్వీనర్, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కల్చరల్, స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి రాహుల్ కుమార్, కలెక్టర్ షణ్మోహన్, జేసీ రాహుల్ కుమార్ మీనా, ట్రైనీ కలెక్టర్ భావన, హాకీ సంఘ ప్రతినిధి రవిరాజు, జేఎన్టీయూకే వీసీ ప్రసాద్, జేఎన్టీయూకే స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి శ్యాంకుమార్, కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ వ్యవస్థాపకులు రవిచంద్ర, అంతర్జాతీయ హాకీ క్రీడాకారుడు డి.మురళీకృష్ణ, డీఎస్‌ఏ కోచ్‌లు పాల్గొన్నారు.
ఆటల్లో గెలుపు ఓటములు సహజం
Comments
Please login to add a commentAdd a comment