రాజానగరం: విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. నన్నయ యూనివర్సిటీలోని ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ స్టూడెంట్స్ (డీసీఎంఎస్) ఆధ్వర్యంలో ‘సవిస్క్రా 2కే25’ పేరుతో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ ఫెస్ట్‌ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసన్నశ్రీ మాట్లాడుతూ యువత తమలోని ప్రతిభకు పదును పెట్టడానికి, నిర్వహణా నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు చక్కటి వేదికలవుతాయన్నారు. ఆరోగ్యకరమైన ఇటువంటి పోటీల్లో పాల్గొనడంతో విజ్ఞానాన్ని విస్తరించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ప్రాక్టికల్ లెర్నింగ్, నైపుణ్యాభివృద్ధి, నెట్ వర్కింగ్ అవకాశాలు, వ్యవస్థాపక మనస్తత్వం, కాన్ఫిడెన్స్ బిల్డింగ్, వ్యాపార పోకడలు, సాంకేతికతకు బహిర్గతం, రెజ్యూమ్, కెరీర్ అవకాశాలను మెరుగుపర్చడం వంటి వాటిపై విద్యార్థులు దృష్టిని సారించాలని సూచించారు. జీతిత బీమా సంస్థ సీనియర్ డివిజనల్ మేనేజర్ (రాజమహేంద్రవరం) కె.సంధ్యారాణి మాట్లాడుతూ ఆధునిక సమాజంలో అన్ని రంగాలలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు. అయితే వాటిని ఆకళింపు చేసుకుంటూ సృజనాత్మక ఆలోచనలతో ముందుకు వెళ్తేనే ఉత్తమ ఫలితాలను అందుకోగలుగుతారన్నారు. ఈ సందర్భంగా అకడమిక్ ఈవెంట్స్‌గా బుల్ వర్సెస్ బియర్ స్టాక్ మార్కెట్, బిజినెస్ క్విజ్, మార్కెట్ మేకర్స్, ట్రెజర్ హంట్, యంగ్ మేనేజర్, కేర్ స్టడీ, మ్యాచింగ్ ది అకౌంటింగ్, లిప్ టిప్, క్లు క్వెస్ట్, టవర్ బిల్డింగ్, గ్రూప్ గేమ్స్ నిర్వహించారు. కార్యక్రమంలో గెయిల్ ఇండియా సంస్థ (రాజమహేంద్రవరం) హెచ్‌ఆర్ మేనేజర్ వైవీఎస్ మూర్తి, హెచ్‌ఓడీ డాక్టర్ ఎన్.ఉదయ్‌భాస్కర్, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment