మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం
తాళ్లపూడి: మహాశివరాత్రి పర్వదినాన తాడిపూడి గ్రామంలో పుణ్యస్నానానికి వెళ్లి గోదావరిలో మృతి చెందిన ఐదుగురు యువకుల కుటుంబాలను వైఎస్సార్ సీపీ శనివారం నాయకులు పరామర్శించారు. గ్రామానికి చెందిన పడాల దుర్గా ప్రసాద్, పడాల దేవదత్త సాయి, అనిశెట్టి పవన్ గణేష్, గర్రే ఆకాష్, తిరుమలశెట్టి పవన్ కుమార్‌ల కుటుంబ సభ్యులను వారి ఇళ్లకు వెళ్లి మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి, గోపాలపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ తానేటి వనిత, కొవ్వూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తదితరులు పరామర్శించి, ఓదార్చారు. ప్రమాదం జరిగిన తీరు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ కాకర్ల వెంకటేశ్వరరావు, తాడిపూడి సర్పంచ్ నామా శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పిట్టా శ్రీనివాస్, జిల్లా గ్రీవెన్స్ సెల్ నాయకుడు గూడా విజయరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment