పీడీఎస్‌యూ రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్
కంబాలచెరువు: విద్యారంగానికి కేంద్ర బడ్జెట్‌లో 20 శాతం, రాష్ట్ర బడ్జెట్‌లో 30 శాతం, జీడీపీలో 6 శాతం నిధులు కేటాయించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. స్థానిక పీడీఎస్‌యూ భవన్‌లో జరిగిన రాష్ట్ర ఆఫీస్ బెరర్ల కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలలో విద్యారంగానికి 34,311 కోట్లు తక్కువ బడ్జెట్ కేటాయించి ప్రచార ఆర్భాటాలు చేసుకునే పద్ధతి మంచిది కాదన్నారు. విద్యను వ్యాపారంగా, కార్పొరేటీకరణ చేయడమే ఈ బడ్జెట్ ముఖ్య ఉద్దేశమన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 2009 నియమ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు కొఠారి కమిషన్ సిఫార్సులను లెక్కచేయని దుస్థితి పట్టిస్తూ కూటమి ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసిందన్నారు. బడ్జెట్‌లో విద్యార్థులు, నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం తీవ్రంగా దగా చేసిందన్నారు. ‘తల్లికి వందనం’ పథకానికి కేవలం రూ.9,407 కోట్లతో ప్రతిపాదనలు చేసి ‘బాబు’ తల్లులను మోసం చేశారని, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంత మందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు బడ్జెట్లో కోత విధించి 84 లక్షల మంది తల్లులను మోసం చేశారన్నారు. గత విద్యా సంవత్సరంలో ఇవ్వాల్సిన తల్లికి వందనంపై కనీస ప్రస్తావన లేదన్నారు. ప్రతి నెలా రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీపైనా మొండిచేయి చూపారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రఫీ, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment