ప్రకృతి సాగు విస్తీర్ణం పెంచాలి
● హార్టికల్చర్ గణనీయమైన
సాగు విస్తీర్ణం సాధ్యం
● కలక్టర్ ప్రశాంతి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం ప్రతి ఏడాది పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని అప్పుడే పర్యావరణ పరిరక్షణ లక్ష్యం సాధ్యం అవుతుందని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, హార్టికల్చర్ క్షేత్ర స్థాయి అధికారులతో 2024–25 లక్ష్య సాధన, 2025–26 లక్ష్యాలపై యూనిట్ ఇన్చార్జిల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం 30,641 మంది రైతుల ద్వారా సుమారు 46 వేల ఎకరాలు లక్ష్యంగా నిర్దేశించగా.. 37,844 మంది రైతుల ద్వారా 44,200 ఎకరాల సాగు విస్తీర్ణం చేశామన్నారు. గత ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఆర్థిక సంవత్సరం వరకూ ఎంత విస్తీర్ణం పెంచ గలిగారో అన్న విషయం ద్వారా మాత్రమే ప్రకృతి వ్యవసాయం దిశగా అడుగులు వేశారో తెలుసుకునే అవకాశం ఉందన్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే యూనిట్ ఇన్చార్జిలు, ఐసీఆర్పీలు, ఇతర సిబ్బంది పనితీరును ఏ విధంగా విశ్లేషణ చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఆర్బీకే స్థాయిలో అనుకున్న స్థాయిలో ప్రకృతి వ్యవసాయ దిశగా అడుగులు వేయడం లేదన్నది వాస్తవం అన్నారు. రాబోయే సమావేశం నాటికి ఖరీఫ్ , రబీ 2025–26 ఈ క్రాప్ డేటా వివరాలు ఎంత మేరకు కన్వర్షన్ చేయడంపై నివేదికలో పేర్కొనాలని ఆదేశించారు. నవధాన్యాల సాగు విస్తీర్ణం పెంచడం పై దృష్టి పెట్టడం ద్వారా ప్రకృతి వ్యవసాయ సాగు పెంచడం సాధ్యం అవుతుందని కలెక్టర్ తెలియజేశారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు, జిల్లా హార్టికల్చర్ అధికారి బి.సుజాతకుమారి పాల్గొన్నారు.
టీచర్లకు రెండు రోజుల అవకాశం
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సీనియార్టీ జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలపాలని జిల్లా విద్యాశాఖదికారి వారి వెబ్‌సైట్‌లో ఉంచినట్టు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాల్లో ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్స్ తత్సమానమైన ఉపాధ్యాయులు, ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు. పీఈటీ ఉపాధ్యాయులు, లాంగ్వేజ్ పండిట్ ఉపాధ్యాయులు తదితర ఉపాధ్యాయులు సీనియార్టీ వివరాలు జిల్లా విద్యాశాఖధికారి వెబ్‌సైట్‌లో ఉంచినట్టు డీఈవో తెఇపారు. వెబ్‌సైట్‌లో ఉన్న సీనియార్టీ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత నమూనా ప్రొఫార్మాతో శని, ఆదివారాలలో కార్యాలయ పని వేళలలో సమర్పించేందుకు అవకాశం ఉందన్నారు.
10న అప్రెంటిస్ మేళా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వివిధ కంపెనీల్లో ఉన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఈ నెల 10వ తేదీన కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాలవర్మ శుక్రవారం తెలిపారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఐటీఐలో ఉత్తీర్ణులై ఎన్‌టీసీ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు ఉదయం 9గంటలకు కళాశాలకు హాజరుకావాలని, ఇతర వివరాలకు 86392 30775 నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.
అధికారుల 2కె రన్
కాకినాడ క్రైం: మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు. శుక్రవారం నాగమల్లితోట నుంచి ప్రారంభమైన ఈ రన్ భానుగుడి కూడలి వరకు సాగింది. అక్కడ మానవహారాన్ని ఏ ర్పాటు చేసి మహిళల భద్రత, రక్షణపై నినాదాలు చేశా రు. కార్యక్రమంలో పోలీస్‌శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
న్యాయ సేవాధికార కమిటీకి
మధ్యవర్తుల నియామకం
అమలాపురం టౌన్: అమలాపురం న్యాయ సేవాధికార కమిటీకి మధ్యవర్తులుగా ముగ్గురిని నియమిస్తూ ఆ కమిటీ చైర్మన్, రెండో అదనపు కోర్టు జిల్లా న్యాయమూర్తి వి.నరేష్ ఉత్తర్వులు జారీ చేశారు. విశ్రాంత స్పెషల్ మెజిస్ట్రేట్ ఎం.రామభద్రరావు, సీనియర్ న్యాయవాది, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ వీకేఎస్ భాస్కరశాస్త్రి, మరో సీనియర్ న్యాయవాది కేవీవీ శ్రీనివాసరావులు మధ్యవర్తులుగా నియమితులయ్యారు. జిల్లా ప్రధాన మండల న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు గతంలో ఈ ముగ్గురూ రాజమహేంద్రవరం జిల్లా ప్రధాన కోర్టులో 40 గంటల పాటు మధ్యవర్తిత్వంపై శిక్షణ పొందారు. ఇప్పడు ఈ ముగ్గురిని మధ్యవర్తులుగా నియమించారు.
ప్రకృతి సాగు విస్తీర్ణం పెంచాలి
Comments
Please login to add a commentAdd a comment