వచ్చే ఖరీఫ్‌లో నూతన వంగడాలు సాగు చేయండి
ఏరువాక ప్రధాన శాస్త్రవేత్త శ్రీనివాస్
కొవ్వూరు: రాబోయే ఖరీఫ్ సీజన్‌లో ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదల చేసిన నూతన వరి వంగడాలు ఎన్‌ఎస్‌ఆర్ 3238, ఎంటీయు 1426 రకాలను ఆర్‌ఎన్‌ఆర్ 15058 వంగడంలో పోల్చి కొత్త వంగడాల పంటకాలం గురించి ఏరువాక ప్రధాన శాస్త్రవేత్త మానుకొండ శ్రీనివాస్ సూచించారు. దొమ్మేరు, ధర్మవరం గ్రామాల్లో పొలంబడి కార్యక్రమంలో భాగంగా క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులు గ్రామ నమునాలను రంగవల్లుల రూపంలో తయారు చేసి రైతులకు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి వివరించారు. గ్రామాభివృద్ధి, గారమ ప్రభుత్వ కార్యాలయాల పనితీరు, విధి, విధానాలు గురించి రైతులకు అవగాహన కల్పించారు. కొత్త వరి వంగడాలు దిగుబడి బాగున్నాయని, రాబోయే ఖరీఫ్ నుంచి వీటిని సాగు చేయాలని రైతులకు సూచించారు. ఈ మేరకు రైతులకు వంగడాల విత్తనాలను చిరు సంచులను అందజేశారు. మండల వ్యవసాయ శాఖ అధికారి ఎ.గంగాధర రావు, ఏఈవో ఎన్.శ్రీనివాస్, నాయకులు గారపాటి వెంకటకృష్ణ, కాకర్ల సురేష్, కుందుల రమేష్, గోపాలకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment