రోడ్డు ప్రమాదంలో నాయనమ్మ, మనవడి మృతి
దేవరపల్లి: ముందు వెళుతున్న లారీని మోటార్ బైక్ ఢీకొన్న ప్రమాదంలో నాయనమ్మ, మనవడు మృతి చెందిన విషాద సంఘటన ఇది. మండలంలోని దుద్దుకూరు వద్ద గుండుగొలను–కొవ్వూరు జాతీయ రహదారిపై గురువారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు, గోపాలపురానికి చెందిన షేక్ మీరా తున్నీషా(65) కుమార్తె ఇటీవల పంగిడి సమీపంలోని గోవర్థనగిరి మెట్టలో మరణించింది. కీడు దుస్తు లు కట్టుకోవడానికి తున్నీషా తమ్ముడు గోవర్థనగిరిమెట్ట పిలిచాడు. దీంతో తున్నీషా, తన మనవడు షేక్ సమీర్(20) గురువారం ఉదయం మోటార్ బైక్‌పై గోవర్థనగిరిమెట్టకు వెళ్లారు. దుస్తులు ధరించి, తిరిగొస్తుండగా దుద్దుకూరు వద్ద హైవేపై ముందున్న లారీని మోటార్ బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో నాయనమ్మ, మనవడికి తీవ్ర గాయాలు కాగా, హైవే అంబులెన్స్‌లో ఆస్పత్రులకు తరలించారు. వారు చికిత్స పొందుతూ కొవ్వూరు ప్రభుత్వాస్పత్రిలో నాయనమ్మ, రాజమ హేంద్రవరం జీజీహెచ్‌లో సమీర్ మృతి చెందారు. కాగా షేక్ సమీర్ గోపాలపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ సెకండియర్ చదువుతున్నాడు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు రాస్తు న్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అతడు శుక్ర వారం పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు.
ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న బైక్
దుద్దుకూరు వద్ద ఘటన
రోడ్డు ప్రమాదంలో నాయనమ్మ, మనవడి మృతి
రోడ్డు ప్రమాదంలో నాయనమ్మ, మనవడి మృతి
Comments
Please login to add a commentAdd a comment